పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

కవులొనరింపగాఁ దగిన కార్యములున్ విడనాడి వాక్యపుం
బవరముచేయు చొండొరుల పైఁబడుచుందురు లాభమేమియో
వివరముసేయ రత్నకవి వేదము వేంకటరాయశాస్త్రియుం
దవిలిరి పెద్దకయ్యమున, గానఁబడెం గవిసంఘ మక్కటా!

తిరుపతి వేంకటేశ్వరులు గద్వాలాది
          దేశంబులం బోరుఁ దెచ్చుకొనిరి
అదియు జిరంతనంబయ్యెఁ ద్రవ్వఁగ నేల
          యొక వంక రామకృష్ణ కవి యుగము
నొక చెంతఁ గొప్పరపు కవి యుగ్మమ్మును
          నెదిరించి బవరంబు వదలరైరి
వృథ సేయుచుండి రివ్విధి ననర్గళమైన
          కవిత నక్కట యేమి గల్గెదాన

వాసిఁ బశ్చిమ ఖండ నివాసులకును
మనకుఁ గల్గిన యట్టి సన్మైత్రి వలనఁ
దెలియఁబడినట్టి నూత్నాంశములు దెలుఁగున
గ్రంధరచన యొనర్పఁగఁ గడఁగ వలయు.

తిరుపతి వేంకటేశ్వరులు తెల్గునవ్రాసిరి యింగిలీషులోఁ
బరగెడు బుద్ద సచ్చరిత పద్యము హృద్యముగాఁగ నీ గతిన్
వెరవునఁ జేయునట్టి కృతివృత్తులు దూరముఁజేసి వీరు మా
సరసన గూరుచుండుటకుఁ జాలరు మాసరిగాఁ గవిత్వమున్
విరచనఁ జేయఁజాలినను వీరల నొప్పెదమంచుఁ గొందఱిం
గురువులటంచు మమ్మనరు కూడదటంచు వచింత్రు కొందఱిన్

ఇవ్విధమునఁ బలుకుచుఁ బలు
చివ్వకుఁగాల్ ద్రవ్వనగునె? చింతింపంగా