పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
327

నెవ్వరి కెవ్వరు సరిగల
రెవ్వరికి న్వారెగాక యేనాఁడైనన్

పద్దుగ కృష్ణరాయపతి పల్లకి యెత్తఁగఁ గూరుచున్న యా
పెద్దన, రామభూషణ కవిక్రియశ్లేష మొనర్పకుండ బల్
విద్దెకుఁ దక్కువయ్యెను గవిత్వ పితామహుఁడన్న గొప్పయుం
బద్దవ వచ్చునే యొకటఁ బ్రౌఢి వహింతురు కొంద ఱెంచఁగన్

కొప్పరపు వారి గుంటూరు వారలు
బిరుదు లిచ్చి చాలఁ బెద్దఁజేసి
నప్పుడెల్ల నీ శతావధానులు గల
రంచు వారు మదిదలంచ లేదొ!

ఒక్క కాలంబు నందు నహోబలుండు
వైదికుండని బ్రమసి సంపన్నుఁ డొకఁడు
పొగడె, నంత నియోగిగా నెగడెనంచు
నొక్కఁడు నిదర్శనముఁ జూపెఁ జక్కగాను

వైదికులు నియోగులును వారల వారలలోన నాడికా
పాదిత భిన్నతం దగిలి బాంధవమందున వారువీరలున్
భేదము గల్గి భోజన విభేదములేక చరించి రిప్పు డీ
వాదము లేల వారలకు వారును వీరికి వీరు సాటి'!

వేదవిహిత కార్యవృత్తుల నుండుట
వైదికులును, లోకవర్తనముల
నియతులై నియోగులయిరి గాకొక జాతి
భేద మెట్టి శాస్త్రవేత్త పలుకు!

వైదికులందు లౌకికులు పండితులుం గవులుంద్రు, వేదవి
ద్యాదరముం గవిత్వమును నచ్చపు బాండితీయుం నియోగులం