పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
315

   మెఱుగుగఁ జేసినారముసుమీ! మతివోయెనునేడు, నాటిది
   త్తఱిఁదలపోసి మమ్ములగృతార్థులఁజేయుఁడి సభ్యు'లంచుఁ దా
   మొఱలిడుఁ; జేతఁగానిపనిఁబూనుఁడు మీరలటంచు నెవ్వరే
   డ్చిరి, యొకవేళనేడ్చి తమచేరువకీడ్చిన నీడ్చినట్టి యా
   పురుషులపజ్జఁజేయవలెఁబో! సభకుం దగువాఁడనంచుఁ ద్రి
   మ్మరిన శుభంబె? వెన్క నసమానముగా నొనరించెనంట! యే
   వరుసను జేసిరో కనినవారిపుడైననులేరె! నాడు కొం
   దఱు నుతియించిరేమొ! యదినాణెమె! హంసలు రానివేళలన్
   గరటములే మహాకవులుగాఁ దలపంబడుటద్ది యబ్రమే

10. పరునిసహాయమందక సభాస్థలినిల్వఁడు పండితబ్రువుం
    డరిదిగఁ దోప మిత్రుని సభాధిపుగానొనరించి వానినే
    పొరిపొరిమూటగట్టుకొని పోవుచునుండును, దారిబత్తెమ
    క్కఱఁగొనిపోవురీతి నటుఁగాకయె యుండిన మాడిచావరే

11. స్థిరుఁడయికూరుచుండి సభఁజేసి వధానముఁబూర్తి సేసినన్
    గరము సెబాసు! వహ్వ! యనఁగాఁ దగుఁగాని; పరప్రదత్తవా
    క్శరణములంగొనంగఁ దమకంబున మాటికిమాటికిన్ సభాం
    తరముననుండి చాటునకుఁ దారుచునుండ నిదేటికంచు నే
    పెఱలనఁబోరు, త్రాగుటకుఁ బీల్చుట కంచని యెల్లవారెఱుం
    గరె! యిటు సభ్యసంతతుల కన్నులఁగప్పుచు నొక్కనాటితొం
    దర నిరుమూడునాల్గయిదునాళ్ళకుఁబెంచి వధానమం చెదో
    జరిపి మృషావధానితెగఁ జంకలుగొట్టుచు విఱ్ఱవీగెడిన్

12. వరమతియైనయొక్క కవివర్యునిమెచ్చి రసజ్ఞుడౌర! యె
    వ్వరుసము లుర్వీనీకనుచుఁ బద్యముఁజేప్ప, స్వకీయనీచతా
    గురుత నెఱింగిరేమొయని గుమ్మడికాయలదొంగపోల్కి బా
    పురె! యులుకుం గడుంగడు; ప్రమూర్ఖుని డంబము లిట్టివేగదా