పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

   నరయఁగ లేదు దానఁగల యర్ద మదేమని బొబ్బరించు; ధీ
   వరుఁడెవఁడిద్దియిచ్చెనని పాండితిచాలకధిక్కరించు; ను
   స్సురుమని నన్‌గలంతురనుచున్ మొగమంతయు నెఱ్ఱఁజేయు; దు
   ర్భరపుశతావధానమిది పప్పును నన్నముఁదింటగాదు దు
   ష్కరవిషయంబు లీఁదగదుగాయనఁ దెల్లమొగంబువెట్టు; నీ క
   రణి నెటెట్లో తప్పుకొనఁగా వశమయ్యది గాకయున్న 'మా
   పరువునునిల్పుడయ్య! మము బాములఁబెట్టకుఁడయ్య! గర్భిణీ
   తరుణియగున్‌సుమా యిదియథార్థము! మేమిటవచ్చినట్లు మా
   పురులకుఁ బంపుడయ్య! యికఁబోదుము పున్నెమదెల్ల మీకుఁజే
   కుఱు'నని కాళ్ళబేరమునకుం జనుదెంచుచు దేవురించెడిన్

8. సరిసరి! కుంభకోణమది సాగుటయెట్లు వధానమొక్క వా
   సరమునఁజేయ ధారణవశంపడకే నగుబాట్లు మాకు దా
   పరమగునో యటంచు మిషఁబన్ని సభన్నిలుపంగఁజేసి రా
   తిరి నుదయంబుఁ బద్దెములఁ దీరిచి వల్లనవేసివచ్చినన్
   మఱుదినమా సభాంతరమునం జదువంగనుబూని తొట్రుపా
   టొఱయఁగఁ బాదముల్ పదములూడఁగఁ జాలునుదప్పఁ బ్రక్కలన్
   వరలినవారు పద్దెములు వ్రాసినవా రటుగా దిటంచు స
   త్వరముగ నెత్తిపట్టి పయిపైనడువం బెయివెట్టినట్టినన్
   జరుగదదెట్టిధారణయె! శక్తియొ! మొద్దది మొద్దుదానినిం
   బరుగిడునట్లు చేయ వశమా! ములుకఱ్ఱయు మొక్కపోవుటే
   జరుగునుగాదె! మొద్దునకు సాయముఁజేయ గ్రహింపనేర్చునే

9. సరకుగొనండుపాపము! స్వశక్తివిధం బిదమిత్థమంచుఁ దా
   నెఱుఁగకపోడు; పండ్లబిగువేర్పడఁగా నవమానదుర్యశః
   పరిహరవాక్యపుంజములఁ బల్కఁదొడంగును, 'మేము వెన్కబల్