పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

13. పెరుగదు మాయవేసమిక వెల్లడియౌనని భీతిగ్రమ్మఁగా
     దరియెదిగానలేక మతిదప్పి చికాకయి ప్రేలినంతలో
     గరువమడంపఁగల్గు కవిగండడువచ్చి యెదిర్చివేయఁగా
     నురముననాటినట్టి శరమూడ్చఁగలేకయె కుందు చెట్టులే
     నరి నెదిరింపఁగావలయునంచును బెగ్గకుఁ బెన్గులాడు, “నా
     శరమదియొక్కటే విడువఁజాలదు, రెంటినిగల్పి ఱువ్వినం
     బెఱుకఁగలేనె నాబలము బీరముచూడుఁడి' యంచుఁ బల్కెడం
     దఱుచుగ నొంటికిం బుధులు దాకినయప్పుడు రెంటికింజనున్

14. మఱుపుకురాదుదెబ్బ, పొడిమాటలుడాబినఁబోదు నొప్పి, న
     న్నరసియెవండుగాచునిక! హా! శివ, రాముడ, స్వామి! యంచు నూ
     పిరి నిలుపంగఁ దోక నెటుఁబీకుటఁ కాయతిగానకార్చుచుం
     ద్వరితగతి ప్రవాహమునఁ దార్కొనిమున్గుచునున్న వాఁడుదా
     గరికనుజూచి దానిఁగొని గండముఁ దప్పుకొనంగయత్నమున్
     బరపెడిలాగు, సింగమదిపైఁబడ నక్కలవేటకాఁడు త
     న్గురువుగనెంచి వెంటఁజనుకుక్కలఁ దా నుసిగొల్పులాగు, ది
     క్కరిపడరాని పాట్లుపడినంతనె లాభమె! పండితబ్రువా!

15. అఱవము నింగిలీషు మఱియాంధ్రము తుర్కముమాటలాడెడున్
     దొరలకువంటవాఁడు నిపుణుండగు బట్లరుపాకశాస్త్రినా
     బిరుదముఁ బూనినాఁడు, పురవీథులఁ గ్రుమ్మరినాల్గుబాసలన్
     “గరిమనుజూపువాఁడ, బుధకాండులు రం' డనఁదోచునట్లుగాఁ
     బరిచితిఁ బూర్తిచెందకొక బాసనునైనను, గోవులేనియా
     పురమున గొడ్డెలచ్చియను పోడిమిఁజెందుచు నొక్కబాసలో
     దరిగనినట్టి పండితునిఁ దార్కొని నావలె రెండుబాసలీ
     వెఱుగవునాకు రావనిన నెంతయులాభ పండితబ్రువా!