పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

గుజనాక్షేపకు సత్యవాజ్నిరతు మాన్యున్ గాళ్లకూర్యన్వయున్
భజనీయున్ వరకావ్యకర్త నవధానప్రక్రియాధుర్యు న
క్కజపుంభంగిని దిట్టనెట్టిగతి నాల్కన్ ద్రిప్పినా రక్కటా!

ప్రతిమల్లుల్కవి సింహలాంఛనులు చేవన్ వారి నోడించు టే
కృతి సాధ్యంబది కాకయుంట నలవారిన్ దిట్టుచున్నారుగా
శతధా నయ్యది యొప్పు నొక్కగతి! దచ్ఛాఖీయులన్ దుచ్చవా
క్తతిచే బూతులు దిట్టుచుంటి రదియే ధర్మంబు యోజింపుఁడీ!

సభలో గెల్తుమటంచు సోదర కవీశానుల్ విజృంభిఁప నా
సభగాకుండఁగ వెఱ్ఱియుక్తులఁ గడున్ సంధించియున్ బాఱి పో
యి, భయభ్రాంతులు కాని భంగి ననృతంబే వ్రాయుచున్నారహా
యభిమానాంబుజగంధికై వలచి మోక్షాపేక్ష వర్జించుచున్!

అవధానంబున యందు నాశుకవితా వ్యాపారమందున్ ద్విష
న్నివహాసాధ్యుల భాతృకవ్యధిపులన్ డీకొంటి మేనిన్ బరా
భవమే సిద్ధము తప్పదంచు నుచితోపాయంబుఁ జింతించి శా
త్రవ వీరుల్ హసియింప నుత్తరకుమారప్రజ్ఞలన్ జూపి నేఁ
డవిలంఘ్య ప్రతిభాప్రచారముల వాక్యాళిన్ విడంబింతురే!

అధికుండో యధముండొ శాత్రవుఁడు తానై పిల్వ డీకొన్నచోఁ
బ్రథనంబుం బొనరించి చావఁగను జంపంగన్ జనున్ గాక య
ప్రథుఁడౌ నాఁడటుగాకమున్ బిలిచి కొప్రంపున్ గవుల్ రా మనో
వ్యధమై మార్కొనలేక పంపితిరి శిష్యశ్రేణి సీ! సీ! యనన్

తద్దినముఁబెట్టు నాతని తమ్ముని బలె
నేను గూర్చుందుఁ దిరుపతిలేనినాఁడు
రోగిమగఁడని నన్ను మీరుఁ దలఁపఁ దగు
ననవె? గుంటూరిలో వేంకటాచలాఖ్య!