పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
307

శపథం బొప్పగఁ గాకినాడను జయస్తంభంబు స్థాపించి మీ
నృపుఁడున్ సత్కవి పండిత ప్రవరులున్ మెచ్చంగ నున్నప్పుడే
వ్యపదేశంబులు సాగి రామికిని నిద్రాసక్తులట్లుండి నేఁ
డపరాభూతులఁ బోలి దూఱెద రిదేలా సోదరద్వంద్వమున్

చండప్రజ్ఞులఁ గొప్రపుంగవుల నేసాధింతు నన్నట్టి ఛా
త్రుండౌ వేలురి వంశ్యుఁడోడినను, బోరున్ మానకున్నారుగా,
గాండీవాయుధు గెల్తు నేనని ప్రతిజ్ఞంగొన్న కర్ణుండు మి
త్రుండీల్గం గనియున్ సుయోధనుఁడు పొందుం జెందకున్నట్లుగన్

కక్షన్ గన్నవరంపు మేటి సభ నక్కవ్యగ్ర యుగ్మంబుఁ దా
నాక్షేపింపఁగ నేగి భంగపడె మీ యాప్తుండు శిష్యుండు హృ
త్సాక్షిం గైకొని తెల్పినార మిదియున్ సత్యంబు సత్యంబనన్
సాక్షుల్ నూర్గురి మించియుండి రిఁక మీ జంజాటముల్ మానుఁడీ

ఎంతో సంశయ మేల? గన్నవరమందే తేటగాఁదేలె మీ
యంతేవాసికిఁ గల్గువాసి, భవదీయాత్యంత తేజోన్నతుల్
వింతల్ కాకపురంబులోఁ దెలిసె మీ వీరాట్టహాసంబులున్
గంతుల్ తిమ్మన గంతులం చెఱిఁగె లోకం బింక శాంతింపుఁడీ

సత్సంభావ్యుఁ డొకండు మీ కరిగ వ్యాసంబొండు సత్యోక్తులన్
హృత్సాక్షింగొని వ్రాసిపంప నపు డన్నింటిన్ బలెన్ విశ్వ వి
ద్వత్సంపూజిత యాంధ్రపత్రిక గొనెం దప్పేమి? యప్పత్రికన్
దత్సంపాదకుఁ దిట్టిపోయనగునే, తజ్ఞుల్ విచారింపఁగా
నుత్సాదింపఁదగున్ దదంశముల బుద్ధ్యుత్సేకమే యుండినన్

అజవం ... ... ... ... ... ... ... ... పత్రికా స్థాపకున్
సుజనాక్షేపకుఁ బక్షపాతపరిపూర్ణుం జానపాట్యన్వయున్
భజియింపంగ! సమస్తపూజ్యగుణ భాస్వత్పత్రికా స్థాపకున్