పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

సరిగ నవధాన పద్యముల్ చదువుఁడనిన
భోజన మొనర్చుటకుఁ బ్రొద్దుపోయెఁ జదువ
వలను పడదంచు బొంకిన వార లెవరొ?
భావమున నెంచుడయ్య బాపట్లపురిని.

వేమవరావధాన మది వేయి విధంబుల మ్రోఁగెఁ బత్రికా
స్తోమమున న్భవత్ప్రజ లసూయకు నెంతటి యాలయంబులో
యేమెయి మిమ్ము మింటిపయికెత్తి నటింపఁగఁ జూచుచుండిరో
దీమసమెట్టిదో, నిజముఁ దెల్పుఁడికేటికిఁ గూటవాదముల్

తిరుపతి వేంకటేశ కవిధీరులు గారొకొ మీరు? మీకుఁ గా
పురమగు కాకినాడ బుధపూజ్యులు కొప్పరపుం గవీశ్వరుల్
దిరముగ నాటలేదొకొ? యతిప్రతిభన్ విజయధ్వజంబు, దు
ష్కరమగు నేఁటి చింతకును గారణ మయ్యది మీకుఁగాదొకో?

తిరుపతి శాస్త్రిగారి వసతిన్ జయకేతువు నాటినారు సో
దరకవు, లేమి సేతునని తల్లడమందుచు నీవు వేంకటే
శ్వర! మొఱపెట్టుటంగద! యసాధ్యతరంబగు పక్షపాతముం
బొరసినవారు వేమవరపున్ ఘను లెక్కుడు పట్టుఁబట్టి కొ
ప్పరమున కేము దుర్యశము వాటిలఁజేసెడి పూన్కియోజనాం
తరముననున్న పల్లియను దా వొనరించి మహాసభన్ సమా
దరమునఁ గూర్చి రందు నవధానము పేరిటి గారడీని నె
య్యురు పలు సాయమున్ సలుపుచుండ నొనర్చితి రందుఁ గౌశలం
బఱగొఱ యౌటచే నపజయం బనయంబు తటస్థమయ్యె న
క్కొఱతలు తీర్చుకో దలఁచి క్రూరవిచారులఁ బక్షపాతులన్
మొఱకుల సత్యఘాతకుల మూఢులఁ గొందఱఁ గూర్చి వ్యాసమున్
బఱబఱవ్రాసి యవ్విబుధ వందితమై తగు నాంధ్ర పత్రికా
వరము పరిగ్రహింపమికి వందురుచుంటిరిగాన దీననే
యెఱుఁగఁ బడె న్భవన్మహిమమెల్ల బుధేంద్రుల కాంధ్రమండలిన్.