పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
309

మరువక వేంకటేశ! వినుమాయిది, నీ సతి వ్యాధివోవ కు
గ్లరు దొరసాని మందొసఁగఁగా నివసించితి వెన్నియేని వా
సరములు గర్తపూర్వసతి సత్యమయా నివసించుటెల్ల సో
దరవిజిగీషనేయని యతథ్యపు గ్రంథము వ్రాయనేటికిన్!

ధారణమెల్లఁ బోయె నవధానము సేయఁగఁ జాలమింక మే
మాఱడి నొందకుండఁగఁ గృతార్థులఁ జేయుఁడటంచు మీర లూ
రూరను వేఁడుచున్న విన రూరక పిల్త్రు వధానమంచు వే
మారులు దెల్పనేఁటి కభిమానులుగా భవదీయు లద్దిరా

ప్రేమగలవారు పిల్చినఁ బిల్త్రుగాక
విడిచిపోయిన యవధాన విద్రుమోష్ఠి
కొఱకు వార్ధక్యమునఁ బండ్లు గొఱుకుకొనుచుఁ
దేప తేపకు నేల సంతాపపడుట!

బూతుల కృతుల న్వ్రాయుఁడు
జేతుల తీట యదివోవఁ జీ చీ యని ప్ర
జ్ఞాతిశయు లేవగింపఁగ
నేతావున సభయటంచు నిక నేగకుఁడీ

అవధానమ్మునొనర్ప నాశుకవితా వ్యాపారమున్ దీర్ప స
త్కవులున్నారు సురూప యౌవన రమాఖండుల్ ప్రచండ ల్సుగౌ
రవ మొందందగువారు మీరలిక వార్ధక్యంబు విత్తాశయున్
దవులన్ లోకము మోసపుచ్చఁదగునా? తంత్రంబు మేలిచ్చునే!

శక్తిచాలని యవధాన సణలు సలిపి,
తెచ్చిపెట్టకుఁ డపకీర్తి దిట్టలకును,
జెడినదగు కోఁతి వనమెల్లఁ జెఱచునన్న
సరణిఁ దిరుపతి వేంకటేశ కవులార!