పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

శిష్యులకు యుద్ధబోధలు సేయు దేశి
కేంద్రులార! కొనుండు మా వందనములు.

కాశికృష్ణ బుధుండు కరుణఁ జూపకయున్న
           నభిమానమున సభలమరకున్నఁ
గొప్పరకవి సాయ మొప్పిచేయక యున్నఁ
          గీరతంబునఁ బ్రొద్దు గెంటకున్నఁ
బృచ్ఛకులను దబాయించి పల్కకయున్న
          నన్యోన్య సాహాయ్య మందకున్నఁ
గృపసేయుఁడవధాన మిది కాదనక యున్న
          మఱునాఁటి కా సభ మార్పకున్న

నేమి యవధాన మిదియని యెచ్చరించు
వారలకు మ్రొక్కకున్న దుర్వారమైన
నేఁటి బింకమ్ము నా నాఁడె నీటఁగలిపి
దారిఁ బట్టింపకున్నె గుంటూరి గోష్ఠి

రణమైనన్ సరియే నియోగి సభఁ జేర్పన్ రాదు ప్రశ్నంబులం
దణువంతైన శ్రమంబు నీయదగ దా యా ప్రశ్నలన్ వైదికా
గ్రణులే కోరుఁడటంచు మున్దెలిపి శాఖాబాంధవుల్ కూర్ప బ్రా
హ్మణకోడూరున సల్పినట్టి సభ మీకౌన్నత్య మిప్పించునే?

కొందఱు మిత్రులున్ మఱియుఁ గొందఱు బాంధవు లేగుదెంచి మా
పందెము నిర్వహించుకొన వచ్చినవారము, ప్రశ్నలన్నియున్
ముందుగ వ్రాసియిండనఁగ ముచ్చట దీరఁగ వ్రాసియిచ్చి, వా
నిం దగఁ గోరఁ జెప్పితిరి నీతియొకోయది? పిన్నపాటిలోన్.

అవధానముల సమస్యల నీయరాదంచు
          సిద్ధాంత మొక్కటి సేయుటయును