పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
305

కావ్యపాఠము సెప్పుకార్యంబు వదలివే
          సినవార మంచు వచించుటయును
శాస్త్రార్థ మొనరించు సరణి యియ్యెడఁ బెట్టు
          కొన లేదటంచు వాక్రుచ్చుటయును
ఆకాశపుఁ బురాణమందు సారంబు లే
          దదియేటి కంచుఁ బోనాడుటయును
గంటలు తప్పినఁగాని యీ యవధాన
          ముల లోటు గాదంచుఁ బలుకుటయును

జూచియేకాదె నవ్విరి సూరివరులు
నరసరాట్పురిలో సభన్ జరుపువేళఁ
బృచ్ఛకుల కెంతయు నమస్కరించువేళ
నొడలెఱుంగని సివ మిప్పు డుండఁదగునె?

తప్పుగాని సమస్యను దప్పటంచుఁ
బలికి పండిత దూషణ సలిపినార
లెదుర గుంటూరునకు రయిలెక్కి పిక్క
బలము జూపుట లెఱుఁగని వారు గలరె?

సన్న్యాసమీయవే శతవధానమున కో
          భారతీ యని మ్రొక్కువార లెవరొ?
ఆశుకవిత్వ మాయలు సేయకిపుడు కా
          పాడరావే యన్నవార లేవరొ?
బృచ్ఛకులార! యంపింపుఁడీ మమ్ము మా
          యూరికేగతి నన్నవార లెవరొ?
యీగండ మీనాటి కెట్లు తప్పింతువో
          పరదేవతా యన్న వార లెవరొ?