పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
303

నెత్తిపై మోయరాని బర్వెత్తుకొనక
పరువు చెడిపోక యుండఁగా బ్రతుకుఁడయ్య

ఇవి కోరుడంచు ముందెఱిఁగించి వారవి
        కోరఁగా వెంటనే కూర్చుటయును
క్రొత్త ప్రశ్నములైనఁ గూడ వీనాడంచు
        మరునాటి కయ్యవి మార్చుటయును
అవధాన కాపట్య మంత శిష్యులకు నే
        రిపి యట్టి ద్రోవనే త్రిప్పుటయును
ఒప్పుల నన్నింటిఁ దప్పులుగా మార్చి
         పొరుగువారలఁ దిట్టిపోయుటయును

నిత్యకృత్యంబులై మీకు నెగడుచుంట
నెఱిఁగియును మిమ్ము నిరసింపరేల కొంద
అహహ! యభిమానదేవతా మహిమగాక!
హస్తగత వస్తువుం జూడ నద్దమేల?

అక్షరతత్త్వంబు నరసియే "పడిశ” మ్మ
          టంచు వ్రాసిన యుపాధ్యాయులార!
సూనృత వాక్కు పేరూని “యేని” పదంబుఁ
          దప్పని నట్టి విద్వాంసులార!
అల “కరోమి” కిఁ “గవయామి” కి యుక్తులు
          సంధించినట్టి ప్రశస్తులార!
అవధాన పద్యంబు లన్ని చదువకున్నఁ
          దప్పుగాదన్న వధానులార!

తగు జనుల గూర్చుచును గీరతమును, సీమ
నెపుడు వినిపించు పౌరాణికేంద్రులార!