పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుభయమో యుండెడిది. 1913 ప్రాంతమున ఓంకారము గురవరాజకవి వీరింట నన్నముదిని చదువుకొనుచుండెను. ప్రతిదినము వీరిందర్శింప నెవరో యొకరు వచ్చుచునే యుందురు. వచ్చినవారినెందఱనైన నేకులమువారినైన భుజింపకుండఁ బోనీయరు.

వీరు సభలకేగునపుడు తమ రెండెద్దులగూడు బండిలోఁ గూర్చుండి యెదురుగా సోదరిపుల్లమ్మగారు వచ్చునట్లేర్పఱచికొని వెళ్ళుచుందురు. కొప్పరమునకు సంతమాగులూరు రైల్ స్టేషన్ 5 మైళ్ళలోనుండును. 1913లో నేలూరు హైమవతీ కల్యాణమున కస్మదాదులము కవులము కొప్పరము నుండియే రెండు బండ్లపై స్టేషనుకుఁ బోతిమి. వారిబండిలో నెక్కినవారినూరకుండనిచ్చిరా? ఆ ప్రయాణముంగూర్చి యొక్కొక్కరు తప్పక పద్యము చెప్పవలసినదేయనిరి. అందెవ్వరే నొక్క పాదముచెప్పి యాలోచించుచుండ నాపద్యమును వారేపూర్తిచేసి యావలి వారింజెప్పుమనెడివారు. స్టేషనుకుఁ జేరువఱకు నీ పద్యవర్షములే.

రైలువచ్చిన పిదప స్టేషనుమాష్టరువచ్చి మమ్ము పదిపదునైదుమందిని నొకపెట్టెలోనే యెక్కించిరి. ఒకపెట్కెకడకు వీరురాఁగా పెట్టెలోనుండి రండు దయ చేయుఁడన్న మాటలు వినిపించెను. ఆయన్నవారికి నామాల పసయేగాని యాకారపు పసలేదు. అందఱము పెట్టెలోఁగూర్చున్న పిదప వారు మీరాబాయి పుస్తకముదీసి వీరికీయఁగా నప్పుడు వారు శ్రీమాన్ రాళ్ళపల్లి యనంతకృష్ణశర్మ గారనియు మైసూరు మహారాజావారి కాలేజీలో పండితులనియుఁ దెలిసికొంటిమి.

వీరు 1. అలవాల లష్కరులో బ్రహ్మశ్రీ ఆదిరాజు తిరుమలరావుగారి మహాసభలో “ముంగాలి” బిరుదునందిరి. 2. మణికొండ ఆస్థానమున మ. రా. శ్రీ, తాటిరెడ్డి గోపాలరెడ్డి జమీందారువారిచే 'బాలసరస్వతి' బిరుదమును, 3. నెల్లూరులో మహాసభాజనులచే 'ఆశుకవీంద్ర సింహ' బిరుదమును, 4. బుచ్చిరెడ్డి పాలెములో మ. బెజవాడ పట్టాభిరామరెడ్డిగారిచే 'విజయ ఘంటికా' బిరుదమును, 5. మదరాసు మహాజనసభలో విజ్ఞాన చంద్రికామండలి వారిచే 'ఆశుకవి చక్రవర్తి' బిరుదమును,

xxxi