పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారము. శృంగారరసమును లెస్సగావర్ణించు భావసంపదగల సత్కవి. నిండు ప్రాయమున నస్ఖలిత బ్రహ్మచారిగానుంట నేటికాలమందరిదిగదా. ఈవిషయమై వీరొకరితో నిట్లనిరి (35 పుట).

నాఁడునునేఁడునేమి? యొకనాఁటికిబోటికిఁ జిక్కఁబోము పూ
బోఁడుల గోడులందగిలి పోఁడిమి మాన్పఁగ లాభమేమి మా
కూడికకర్హ లంచు, విధికూర్చినవారలు గల్గిరింత, కే
బోఁడులతోడ నేమిపని? పూర్ణయశస్కుల కిట్లెఱుంగుమా!

వీరు శౌచము నేమఱనివారు. శిష్యుఁడు చెంబుపట్టుకొని వెంటరాఁగా నూరివెలుపలికేగి వచ్చెడివారు. చెవిజందెముతోఁ దలగుడ్డతో వారువచ్చునప్పటికి పంచయరుగుపై రెండు నీళ్ళ చెంబులు సిద్ధముగా నుండెడివి. ఎనిమిదిసార్లు గండూషించవలసినదే. వీరింటిదగ్గఱనున్నపు డుదయస్నాన సంధ్యావందనములు జపము చేసికొనెడివారు. ఇంతయద్భుతశక్తి వారికుండుట కేమంత్రబలమోయని

మేమనుకొనెడివారము, వీరెప్పుడు విక్రయాన్నపానము లెఱుఁగరు. సభలకేగినపు డాహ్వానించినవారే గౌరవింతురుగదా. మధ్యాహ్న పదార్థములరాత్రి ముట్టరు. వీరికిఁ బ్రతిదినము మాపటివేళ కందిపచ్చడి తప్పకయుండవలె. వీరికిఁ బొడుము పీల్చు పండితలక్షణములేదు. పొగత్రాగు పామరలక్షణము లేదు. గోదావరివారి వలె తరవాణి త్రావరు. దక్షిణాదివారివలె కాఫీ త్రాగరు. వీరికింటిసంగతులేవియుఁ దెలియవు. పట్టించుకొనరు. వ్యవసాయమున్నది. జీతగాఁడున్నను నది బ్రాహ్మణ వ్యవసాయమే. ఆయాపనులఁ దమ్ములేచూచుకొందురు. వీరికేకాలము పాడి యుండెడిది. వీరి యింటికి సింహద్వారముత్తరమున నుండును. ఇంటి ముందు పంచకలదు. ఆ పంచలో వాఁకిలికిఁదూర్పుగాఁ బెద్దయరుగుపాలగచ్చు చేసినది గలదు. అందుఁజాపపై వీరుకూర్చుండి సారస్వతసేవసేయు చుందురు. చుట్టును బుస్తకములు పడియుండును. పంచలోఁ బడమటివైపొక చిన్నయరుగునందుఁ బుస్తకములుండుగది కలదు. వీరన్న నింటనందఱకు భయమో గౌరవమో లేక

xxx