పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. మద్రాసులో మఱొకసభలో 'విజయఘంటికా' బిరుదమును, 7. గుంటూరులో మహాసభాజనులచే 'కుండినకవిహంస' బిరుదమును, 8. గుంటూరు సోమసుందరేశ్వరాలయ సభలో 'కవి రత్న' బిరుదమును, 9. బాపట్లలో మహాసభాజనులచే 'అవధాని పంచానన' బిరుదమును, 10. మార్టేరులో మహాసభా జనులచే 'కధాశుకవీశ్వర' బిరుదమును బొందిరి. 11. ఏలూరులో శ్రీ రాజామంత్రి ప్రెగడ భుజంగరావు బహద్దర్ జమీందారుగారు తమ ప్రథమ పుత్రికయగు హైమవతి పరిణయమునకు నలుదిక్కులనున్న పండితకవుల నందఱ నాహ్వానించిరి. పెండ్లికి వచ్చిన కవులందఱకు శాలువలనేగాక రానుపోను ఖర్చులఁగూడ నిచ్చిరి. వధూవరులనాశీర్వదించిన 233 మంది కవులచరిత్రలను “ఆధునిక కవి జీవితములు" అను పేర నొక గ్రంధమునచ్చిత్తించి భాషకెనలేని యుపకారమొనర్చిన రాజాగారు చిరస్మరణీయులుగదా. ఆ పెండ్లి నాకబలినాఁడు 22-12-1913 కొప్పరపు కవుల యాశుకవిత్వ సభ జరిగినది. శ్రీవేదము వేంకటరాయశాస్త్రులవారధ్యక్షులుగా నుండిరి. మహా? మహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు శ్రీవడ్డాది సుబ్బారాయ కవిగారుమున్నగు పండిత కవులెల్ల సభనలంకరించిరి. హైమవతీ కల్యాణమాశువుగాఁ జెప్పఁబడెను. సభాంతమున వేంకటరాయశాస్త్రిగారు “వీరి కవితా విశేషము గంగాప్రవాహమువలె నుల్లసిల్లుచు వినువారల కానందము గల్గించు చుండె. నేనెన్నఁడు నింతటి శీఘ్రరచనంజూచియుండలేదు” అని ప్రశంసించిరి. బ్రహ్మశ్రీ పేరి కాశీనాధశాస్త్రులవారు శ్లోకరూపమునఁగొనియాడిరి. శ్రీరాజా వారయ్యాశుకవుల కిద్దఱకు "ఆశుకవిశిఖామణి” అను బిరుదాక్షరములతోఁ గూడి నట్టియు, మణిఖచిత మధ్యదేశంబులునగు సువర్ణ కంఠాభరణములు చెఱి యొకటి పారితోషికమిచ్చిరి.

వీరాశువుంజెప్పు నపుడెంతటి వ్రాయసకాఁడును వ్రాయలేఁడు. కారణము? పద్యములను జెప్పుచో తడవుకొనరు. ఆలోచించుచు నాలసింపరు. వేసినపదముందీసి వేయరు. వచ్చినపద్యముల నొప్పగించునట్లు సమమైన వేగముతోఁ బద్యములను నడిపించుకొని పోవుచుందురు. వీరెక్కువగా దుష్కర

xxxii