పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గారి నెడబాయవలసివచ్చెను. ఇరువురము ఒకనాడు ముచ్చటించుకొనుచు మన జీవితము లెప్పుడును కుటుంబపోషణకార్యములందే వినియోగించుటయా, లేక మరి ఏదైన పరోపకారముచే ధన్యతజెందుటయా యనిచర్చించుకొంటిమి. కుటుంబార్థము కొంత సొమ్ము నిలవచేయుటకై పదిసంవత్సరము లీ నృత్తులందే గడిపి, ఆ గడువు ముగిసినతోడనే వృత్తివిసర్జనముచేసి అప్పటికి యుక్తమని తోచిన దేశసేవాకార్యమునందు ఉభయులము కలిసి పనిచేయవలెనని తీరుమానించుకొంటిమి. నామిత్రుడు హనుమంతరావు బందరులోనే స్థిరవాసముచేయు నుద్దేశముతో ఊరివెలుపల విశాలావరణ గల పాతబంగళా నొకదానిని పదమూడువేలకు గొని అందు ప్రవేశింపవలె నను సన్నాహములో నుండెను. ఆయనకు చల్లపల్లి జమీందారుగారి దివాను శ్రీ కోపల్లె కృష్ణారావుపంతులుగారి అభిమానమువలన చల్లపల్లివారి ఫైలు లభించుననియు, పబ్లిక్‌ప్రాసిక్యూటరు పనికిగూడ ప్రయత్నముచేయవలెననియు ఉద్దేశము గలిగెను. ఈ ప్రయత్నములగూర్చి హనుమంతరావు నాతో ముచ్చటించలేదు. ఇతరులవలనమాత్రమే నేను వింటిని. అదిగాక మేము కలిసి పనిచేయుచుండగనే చల్లపల్లివారికేసులు కొన్ని తాను పుచ్చుకొని పనిచేసెను. ఆ కేసులవృత్తాంతముగాని ఫీజుగాని నాకు దెలుపలేదు. ఆ మొత్తములు జాయింటులెక్కలో జమపడలేదు. కొంతవరకు నా కీవిషయము తెలిసినను సాటి మర్ధ్వులైన కృష్ణరావుగారి అభిమానముచే లభించిన పనియగుటవలన ఆ కేసులలో వచ్చిన ఫీజులో నాకు భాగము రాకపోవుట సహజమేయని సమాధాన పరచుకొంటిని. ఇదిగాక కొలదికాలములో గుంటూరునకు