పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గాని, శాస్త్రపరిజ్ఞానముగాని ఎచ్చటను మాకు గానుపించలేదు. సామాన్యశ్రౌతస్మార్తకర్మపరులును, పూర్వాచారపరులు మాత్రము కనబడుచుండిరి. ఇందు స్త్రీలు విద్యావ్యాసంగము లేనివా రయ్యు గృహకృత్య నిర్వహణమున నిపుణులుగనే యుండిరి. ముఖ్యముగ కొన్ని బ్రాహ్మణగృహములలో వితంతులైన యువతులు చేయుసేవయు, వారి వైరాగ్యమును శ్లాఘ్యముగ నుండెను.

ఇట్లెందరో వైధవ్యమును పొందిన యువతులు పుట్టినింటనో అత్తవారింటనో నిర్బంధముగ సేవాపరత్వముచే జీవితము గడపుచుండిరిగదాయని సంతాపము చెందితిమి. వారిలో బుద్ధి పూర్వముగ విరక్తలై సేవాపర లగువారు అరుదుగానుందురని యూహించితిమి. అట్టివారికి విద్యనేర్పుటకు విద్యాశాలలును, శరణాలయములును, దేశమున స్థాపించుట యవసరమని తలంచితిమి. మేము చేసిన ఉపన్యాసములధోరణి వినినపిమ్మట భానుమూర్తిగారి ఇంటిలోని ఆడవారు ప్రభుత్వాధికారులవలన ఏమి యొత్తిడికలుగునో యని భయముచెందిరని నాకు దెలియవచ్చినది. మరల సంచారము సల్పుట మాత్రము కలుగలేదు.

ఇంతలో కృష్ణాజిల్లాలోనుండి కృష్ణానదికి దక్షిణభాగమున నున్న గుంటూరుభాగమును విడదీసి, నెల్లూరుజిల్లాలో చేరియున్న వంగోలుతాలూకాను కలిపి, ప్రత్యేకజిల్లాగా చేయుట తటస్థించెను. ఆ జిల్లాకు గుంటూరు ముఖ్యపట్టణమై అందు కలెక్టరుకచ్చేరి, జిల్లాకోర్టు నేర్పడెను. అంతట నా జన్మస్థానమగు గుంటూరులోనే నా వృత్తిని గడపవలెనని తలచితిని. భానుమూర్తి