పుట:Konangi by Adavi Bapiraju.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సరోజిని: మేం ఆడవాళ్ళం లేమా, మాచేత కాదా?

డాక్టర్: మీరంతా పేపరు నడపడానికి పూర్తిగా పూనుకుంటారా?

లేకపోతే మీ కాంగ్రెసు మగవాళ్ళ పిచ్చిపనులులా మీరు కూడా పిచ్చివాళ్ళయి పోతారా?

సరోజిని: డాక్టరుగారూ, ఆడవాళ్ళు పిచ్చివారు కారు, మగవాళ్ళూ కారు, ఇంతకూ మమ్మల్ని ముందు జయిలుకు పోనీయండి.

డాక్టర్: జయిలు ఓ సినిమాలాగ మాట్లాడుతున్నారే!

చౌధురాణి: మీ కమ్యూనిస్టులు కాంగ్రెసుపైకి నల్లేరుమీదకు బండిలా తయారవుతారే! భారతదేశ స్వాతంత్ర్యము మా జన్మాశయం. అందుకై భారత మహిళలు అర్పించిన సేవ వర్ణనాతీతం. మాభర్తలను జయిళ్ళకు పంపాము. వారిప్రాణాలు ఆహుతిస్తే అది అతిపవిత్రకార్యమని ఆనందంలో ఓలలాడినాము. మాబిడ్డల్ని, మాతండ్రులను జైళ్ళకు పంపాము. మేమే ఓలలాడినాము. మేమే జైళ్ళకు వెళ్ళాము. ఇంకా ఎంతో త్యాగం చేయాలని అందుకు మేం సిద్దంగా ఉన్నాం.

డాక్టర్: అద్బుతమైన లెక్చరు. సరే మధుసూదనుగారూ, కోనంగిగారూ జైలుకు వెళ్ళవచ్చునన్నమాట.

సరోజిని: వందేమాతరం! తప్పక!

డాక్టర్: నీ ఉద్దేశం అదేనా అనంతలక్ష్మీ!

అనంత: ఆఁ!

8

డాక్టరుమాట వింటూనే అనంతలక్ష్మికి ఏదో భయం ఆవహించింది. ఏమిటి డాక్టరుగారు యిలా మాట్లాడుతున్నారు? ఏమిటి ఈయన ఉద్దేశం? నిజంగా తన ప్రియభర్తను ఆయన కారాగారానికి వెళ్ళమని సలహా ఇస్తాడా? వారు జైలుకు వెడితే తాను వారిని విడిచి బ్రతుకగలదా? ఆ వెనుక తాను యమలోకమే అనుభవించింది! మళ్ళీ అదేరకంగా వారికోసం బాధగా నిరీక్షిస్తూ ఉండడవలసిందేనా? వారి మాటలు వినక, వారి ప్రేమలో ఓలలాడక, వారి హృదయాన తలవాల్చి వారి లాలింపులు పొందక, నిమిషం ఒక యుగంగా గడుపుతూ, ఏకాకిలా ఉండగలుగునా తాను?

అనంతలక్ష్మి ఆలోచనలకు అడ్డు వచ్చి డాక్టర్ రెడ్డి అనంతలక్ష్మి వంక తిరిగి "అనంతలక్ష్మీదేవీ! నీ భర్త లోకంలోకల్లా మంచివాడు మంచిమాటలు చాటుననుకోవాలి. అతనికి ఈ సమయంలో జైలుకు వెళ్ళాలనిన్నీ, లేకపోతే తాను దేశానికి ద్రోహం చేసినవాడనవుతాననీ బుద్ధిపుట్టింది. నేను వాదించా కాని లాభం లేకపోయింది. నీ ఉద్దేశం కనుక్కోవాలని నిన్ను అడిగాను. నువ్వుకూడా ఒప్పుకోడం నీ గాఢదేశక్తిని తెలియజేస్తోంది. నిజంగా నువ్వు వీరపత్నివి. ఉత్కృష్ట నారీ ధర్మం నిర్వహించే దివ్యజీవనం గలదానివి” అని అన్నాడు.

చూస్తూ చూస్తూ వుండగా అనంతలక్ష్మికి కన్నీళ్ళు తిరిగినాయి. మూత్తమ పురుషుడు తన భర్త. తాను వట్టి మూరురాలయిపోయి, భర్తను అనుమానించి అవమానించింది. ఒక నిమిషం భర్తను వదలి మనలేని తాను ఆయన్ను ఎన్నో అవమానపాలు చేసి ఆయన్ను జైలుకు పంపివేస్తోంది. ఆయన జైలుకు వెళ్ళడానికి