పుట:Konangi by Adavi Bapiraju.pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

సంకల్పించుకొన్నది తన తెలివితక్కువ మాటలవల్లనే! నిజంగా ఆలోచించుకొంటే తన అంతరాంతరాల్లో తాను భర్తను ఎంత ప్రేమిస్తో ఉన్నా ఆయన తన విషయంలో తనకన్న తక్కువవారనీ. తనవల్లనే వీధిలోని ఒక బిచ్చగానిలా ఉన్న భర్త భాగ్యవంతుని ఆనందం సంపాదించుకొనగలిగారనీ అనుకున్నది గదా! తనలో ప్రేమ తగ్గి ఉండాలి. తనలోని హీనత్వం పైకి ఉబికి వచ్చి ఉండాలి. అందుకనే వారు చల్లగా జైలుకు వెళ్ళాలని సంకల్పించుకొని ఉండాలి. | అనంతలక్ష్మి లేచి గబగబ గదిలోనికిపోయి పడక కుర్చీలో కూలిపోయి భరింపలేని దీనస్థితిలో పడిపోయి కళ్ళనీళ్ళు కారిపోతూ ఉండగా అరనిముసంలో మోము మూసుకొని తలవంచి శోకదేవత అయిపోయింది. అనంతలక్ష్మి తలెత్తి చిరునవ్వు తెప్పించుకొని “డాక్టరుగారూ, ఆయన జైలుకు వెళతామన్నారా మీతో?” అని ప్రశ్నించింది. “నామీద ప్రేమ పారమా అపారమా?” డాక్టరు: ఆఁ! ఆ! పారము, జయిలుకు వెడతానన్నాడు. అనంత: నాతో చెప్పకుండానే! డాక్టరు: చెప్పాలని చూచాడు. కాని నువ్వు గర్భవతివిఅనంత: మీ మాటలకు అర్థం ఏమిటి? సత్యాగ్రహం చేశారా? డాక్టరు: చేస్తే? అనంత: చేశారో చెప్పండి! సరోజిని: చేసి ఉంటే ఆయన పాదాలకు నా నమస్కారాలు. జయలక్ష్మి: ఏమిటా మాటలు అమ్మా! మీ ఆయన అంత తెలివితక్కువ పని చేస్తారా? సరోజిని: అది తెలివితక్కువపనా అత్తగారూ? డాక్టరు: అంత ఉత్తమకార్యం ఇంకొకటిలేదు. అనంత: ఇంతకూ మీరనేది ఏమిటి?(ఆమె చాలకోపంతో లేచింది) నన్ను వదలి జైలుకు వెళ్ళమనండి. నాకు భయమా? వందసార్లు వెళ్ళమనండి. జైల్లోనే కాపురం పెట్టుకోమనండి. జయలక్షి: అమ్మిణీ, ఊ కంగారుపడకు! డాక్టరు: కోపపడకు అనంతలక్ష్మి! గర్భంలోని శిశువును తలచుకో! అనంత: (నవ్వుతూ) ఏమి చేయమంటారు నన్ను? సరోజిని: నువ్వు ఉత్తమసాధ్వివి. నీ భర్త ఉత్తమ పురుషుడు. మీ దాంపత్యం ఆదర్శ స్వరూపం. వదినా, నీ ప్రేమకు మా కృతజ్ఞత ఎంతయినా సరిపోదు. నీ భర్త నిన్ను మెచ్చుకోని నిమిషం ఉండదు. నీ పేరు సర్వకాలస్మరణ ఆయనకు. చౌధు: అనంతలక్ష్మి అక్కా నీ ప్రేమ ఒక దివ్యకాంతిపుంజం. డాక్టరు: అందుకని నీ భర్త అరెస్టు అయినా నువ్వు ఆనందరూపిణిగా ఉండాలి. అతడు... డాక్టరు “అతడు” అని అనగానే అనంతలక్ష్మి వెలవెలబోయి, కూలిపోయి, కళ్ళు తిరిగిపోయి వెనక్కు వాలిపోయింది. | ఆ వెంటనే డాక్టరు తన చేతికి నర్సు అందించిన ఇంజక్షను తీసుకొని, అనంతలక్ష్మి భుజంపై పొడిచినాడు. కోనంగి (నవల) 257