పుట:Konangi by Adavi Bapiraju.pdf/253

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

ప్రేమ ఏమిటి అంటారు. కాని స్త్రీ ఇంతకన్న ఏమి చేస్తుంది. ఈ అసంగతపు చరిత్రవల్లనే స్త్రీ తన్ను తాను రక్షించుకుంటూ ఉంటుంది. పురుషుడు స్త్రీ అంటే పడి ప్రాణం విడిచినంతటి గడబిడ చేసుకోవడమే స్త్రీకి పెట్టనికోట.. | ధర్మభావమయితేనేమి, ముందు విషయం ఆలోచించుకోవడం లేక పోవడంవల్ల నయితేనేమి, తాను చిత్రంగానే బ్రతికాడు. చేసిన పనికి తాను విచారించడంలేదు కాని ఆ పని తనకూ చౌధురాణీకి సైంధవునిలా అడ్డంపడితే ఎట్లాగు? | చౌధురాణీ చదువుకున్నబాల. సంస్కృతి కలది. ధీశాలిని. అలాంటి అమ్మాయి తన జీవితం అంతా ఆలోచించుకొని అర్థం చేసుకోలేదా! అని అనుకున్నాడు డాక్టర్. మొత్తంమీద ఏది ఏమవుతుందో అని కొంచెం భయంపట్టుకుంది డాక్టర్ కు. ఆగష్టు ఇరవై రెండవ తారీఖున సాయంకాలము కోనంగి చౌధురాణీ, మధుసూదను, సరోజిని బీచికి వెళ్ళినప్పుడు, చౌధురా కోనంగీ ఒకచోట కూర్చొని ఉన్నారు. తక్కిన వారిని దూరంగా పొండి అని, కోనంగి ఇదివరకే డాక్టర్ గారి పెళ్ళిమాట విషయం చెప్ప కోరియుండడంచేత, వారు ఏవోమాటలు చెప్పుకుంటూ దూరంగా వెళ్ళిపోయినారు. " | కోనంగి వెంటనే చౌధురాణీతో “చౌధురాణీ! డాక్టర్ రెడ్డి చాలామంచివాడు....” అని ప్రారంభించాడు. “నేను కాదన్నానా బ్రదర్!” “విను నా మాటలు పూర్తిగా _” “నేను విననన్నానా?” “సరే, డాక్టర్ చిన్నతనంలో కొన్నితప్పులు చేశాడు!” “చేయమను. నాకెందుకు?” “పురుషుడవడంచేతనూ, డాక్టరవడంచేతనూ—” “ఇప్పుడు ఆ రెండూ కాడా ఏమిటి?” “అతడు ఏదో రకంగా తృప్తి తీర్చుకొనేవాడు.” “ఏమిటయ్యా! ఏవేవో గొడవలు?” “అతడు ప్రేమ అనే పదార్థం ఉంటుందని ఎప్పుడూ నమ్మేవాడుకాడు.” “పాపం! ఇప్పుడు బుద్ది మారిందా ఏమిటి?” “ఆ! అందుకు కారణం నువ్వే” “నేనెప్పుడూ ఆయనతో ఏమీ మాట్లాడలేదే!” “మాట్లాడకుండానే అంతపని చేశావు. మాట్లాడితే డాక్టరేమయ్యేవాడో!” “కళ్ళు తేలేసేవాడు! యిప్పుడు మాట్లాడకుండానే సగం తేలవేస్తున్నాడు.” “ఆయన నిన్ను ప్రేమించాడు, తన జన్మ నీ పాదాల దగ్గర ఉందంటున్నాడు.” “ఆయన పైత్యము కొంత, నా శైత్యము కొంతలా ఉంది!” “మధ్యను నా దౌత్యమూ!” “ఇంతకూ నువ్వు చెప్పేది ఏమిటి?” “డాక్టర్ రెడ్డిగారు నిన్ను వివాహమాడ-” “కాదయ్యా! నువ్వు చెప్పేది చెప్పమన్నాను!” “తప్పక నువ్వు వివాహం చేసుకోమనే నా అభిప్రాయం!” ఇంతలో అనంతలక్ష్మి గబగబ వీరిద్దరికడకూ వచ్చింది. కోనంగి (నవల)