పుట:Konangi by Adavi Bapiraju.pdf/222

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

కోనంగి: అహింసా సత్యమార్గాలంటే యిష్టంపడి, ఆ దారిలో ప్రయాణంచేయ ప్రయత్నించే వాళ్ళ హృదయాలన్నమాట కత్తిచేతరాయా! డాక్టర్: ఒకటి మనవి చేసుకుంటా ఉండు, జావకుండ చేతిరాయా! కోనంగి: మనవి చేసుకోవచ్చునయ్యా స్టెతస్కోపు ఆయుధహస్తా! డాక్టర్: ఆకర్ణింపుము చీపురుకట్టహస్తా. కోనంగి: చెవి ఒగ్గి నాయనా ధర్మామీటరు కొలతబద్ద విభూషా! డాక్టర్: లోకంలో కడుపునిండా తిండి తినేవాళ్ళు పదికోట్లు. ముప్పాతిక తిండి మాత్రమే కలవాళ్ళు పది హేనుకోట్లు. అర తిండి కలవాళ్ళు ముప్పదికోట్లు. పావు తిండి కలవాళ్ళు ఆరవైకోట్లు. పాతికకోట్లకు ఏమీ తిండేలేదు. కోనంగి: రెట్టింపు తిండి ఉన్నవాళ్ళూ, లెక్కలేనంత తిండి ఉన్న వాళ్ళూ, వాళ్ళ లెక్కచెప్పవేం? డాక్టర్: రెట్టింపుతిండి ఉన్నవాళ్ళు పదికోట్లు ఉంటారు. అయిదు రెట్లు తిండి ఉన్న వాళ్ళు రెండుకోట్లు ఉంటారు. ఏభై రెట్లు తిండి ఉన్నవాళ్లు పది లక్షలు ఉంటారు. వేయిరెట్లు తిండి ఉన్నవాళ్లు పదివేలుంటారు. లక్షరెట్లు తిండి ఉన్నవాళ్ళు నూరుమంది ఉంటారు. పదిలక్షల రెట్లు తిండి ఉన్నవాళ్లు ఒకరో ఇద్దరో ఉండక తప్పదు. కోనంగి: సరే! అంచనాలు నిజమే అనుకుందాము... " డాక్టర్: నిజమే అనుకోక అబద్దం అనుకో! నీబోటి బూర్జువాలు ఏదయినా అనుకుంటారు. బీదతనం ప్రపంచంలో పోకూడదు. మానవ బానిసత్వం పోకూడదు. అహింసా, అహింసా అని వాగే నీబోటి దద్దమ్మలే హింసావాదులు. డయాబిటిసు వచ్చి మధుమేహవ్రణం వేస్తే, తులసి ఆకులతో మంత్రించే నీబోటివాళ్ళు రక్తంతాగే జాతి వాళ్ళు. ఆపరేషను చేస్తే తప్పా? అది హింసా? రోగిని మంటగలిపే మంత్రించిన నీళ్ళప్రయోగం అహింసా? కోనంగి: అంతకోపం యెందుకు నాయనా? డాక్టర్: కోపంకాదూ! ఎంతకాలము ప్రపంచం ఊరుకుంటుంది? ఎంతకాలం ప్రజలు ఊరుకుంటారు? ప్రజాచైతన్యం విజృంభిస్తోంది రష్యా నెగ్గనీ, ఈ బూర్జువాల, నీబోటి పూంజీదారుల ప్రభావమూ, శక్తీ మంటగలిసి పోతుంది.. కోనంగి: వినండి వినండి, అని కేకలు నేను. సామ్యవాదం జిందాబాద్! పూంజీదారులు మురదాబాద్! అని గందరగోళం. డాక్టర్: ఏమిటి నువ్వనేది? కోనంగి: నాటకంలో భాగం అప్పజెప్పుతున్నా, డాక్టర్: నీ వ్యాపారం అంతా నాటకంలాగే ఉంది. డబ్బుగల పిల్లను చేసుకొని కులుకుతున్నావు. కోనంగి: దెబ్బకొట్టు! “నువ్వు కూడా నా బ్రూటసూ? అన్నట్టు నువ్వూ చెట్టిగారితో చేయిచేయీ కలుపు. డాక్టర్: నువ్వు ఏం చేస్తున్నట్లు? కోనంగి: నాకు అనంతలక్ష్మి ధనం కావాలా? ఐశ్వర్యం కావాలా? నా బ్రతుక్కి ఆవిడ డబ్బులో ఒక్క దమ్మిడీ అయినా వాడుకోను. నాకు అత్తగారింటిలో ఆంబోతులా పెరుగుదామని ఉందనుకున్నావా? నేను తీవ్రంగా ఒక విషయం ఆలోచిస్తున్నాను. డాక్టరు: ఏమిటా మహత్తర విషయం? 212 అడివి బాపిరాజు రచనలు - 5