పుట:Konangi by Adavi Bapiraju.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

కోనంగి: దానికి మా అనంతమే కారణభూతురాలు. ఆవిడగారు నన్ను ఒక తెలుగు దినపత్రిక పెట్టమంటూంది. ఇదివరకే స్థాపితమై నేడు భూస్థాపితమయినంత పనైన ఒక దినపత్రికను నామకః డబ్బుపెట్టి కొనమంది. డాక్టరు: పెట్టుబడి? కోనంగి: తాను ఒక లక్షరూపాయలు పెట్టుబడి పెడుతుందట! డాక్టర్: వారేవా! కాని ఏదో పనిచేయి. నీ దృష్టిలో నూతన దృక్పథం తీసుకురా. ఆ పేపరు పేరు? కోనంగి: “నవజ్యోతి” ఆ పేపరు 1936లో బయలుదేరి 1937లో తొంగుంది. అందుకు సంబంధించినవన్నీ అమ్ముడుపోయాయి. పేరు మిగిలింది. కంపెనీ లిక్విడేటు కాలేదు. మా అనంతం క్లాసుమేటు స్నేహితురాలిని తీసుకొనిపోయి, ఆ అమ్మాయి తండ్రి ప్రభుత్వ అడ్వైజరీగారిని సలహా అడిగింది. ఆయనా కాగితం 'కోటా' (వంతు) ఇప్పిస్తానన్నాడు. కోనంగి డాక్టరుగారితో అన్న ముక్కలు నిజమే! దినపత్రిక పెట్టడం చాలా ముఖ్య మనుకున్నాడు. ఏ రాజకీయ పక్షంవైపు మొగ్గకుండా ఉండడం మొదటిరోజులలో, తర్వాత “అటునుంచి ఇటు నరుక్కురమ్మన్నాడు” అనుకున్నాడు. | పేపరు జయలక్ష్మి అనంతలక్ష్ముల పేరను కొనవలసి వచ్చింది. పత్రికామందిరానికి హారిసరోడ్డులో ఒక పెద్ద మేడిల్లు అద్దెకు పుచ్చుకున్నాడు. డాక్టరుగారి సహాయంతో ఒక చిన్న రోటరీ మిషను రెండు వేలకు కొన్నాడు.. | రియాసత్ ఆలీ అడ్వర్టైజ్ మెంటు మేనేజరు పని చేసేవాడు. అనంతలక్ష్మి కోనంగిరావులు సంపాదకులు. మధుసూదనరావు మేనేజరయ్యాడు. ఇతర ఆంధ్ర దినపత్రికలలో పనిచేసే ఇంకొక పెద్దమనిషి సుబ్బారావుగారు వార్తా సంపాదకుడు. ఇంకా ఇద్దరు అనుభవంగల యువకులు ఉపసంపాదకులయ్యారు. | అనంతలక్ష్మి స్నేహితురాండ్రూ కారులమీద పోయి నెలరోజుల వరకు ప్రకటనలు రోజుకు పదిహేను నుండి ముప్పటివరకూ వచ్చే ప్రకటనలు పట్టుకువచ్చారు. | జయలక్ష్మి తాను బాగా ఎరిగిన అరవయ్యంగారు జ్యోతిష్కుని ఒకరిని పట్టుకొని ముహూర్తం పెట్టించింది. . హారిస్ రోడ్డులోని “నవజ్యోతి కార్యాలయానికి అన్నీ జేర్చి, ఆ కార్యాలయం సిద్ధం చేసేటప్పటికి 1941 సెప్టెంబరు నెలాఖరయింది. టైపు ఏది పెట్టాలని వాదన వచ్చింది. పాయింటుటైపు అందం అంటాడు డాక్టర్ గారు. మధుసూదనుడు పూర్వకాలపు జి.పి., ఇంగ్లీషు బాడీలు ఉత్తమం అంటాడు. | చివరకు డాక్టర్ గారి మాటే నెగ్గింది. టైపు కేసులు వచ్చాయి. కంపోజిటర్లు చేరారు. అక్టోబరు నెలలో ప్రారంభ ముహూర్తం. , వెనుకటి 1914 ప్రపంచయుద్ధానికీ, ఈనాటి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికీ ఎంతో తేడా ఉంది. వెనుకటి యుద్దానికీ ఈ యుద్దానికీ పోలికలు కొన్ని ఉన్నాయి. 1. ఆ యుద్దమూ ఈ యుద్ధమూ ప్రారంభించిన మహానుభావులు జర్మనీవారు. 2. ఈ రెండు యుద్ధాల్లో ఇంగ్లీషువారూ, ఫ్రెంచివారూ మిత్రమండలి ఆయ్యారు. కోనంగి (నవల) 213