పుట:Kimmurukaifiyatu00unknsher.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చాగలనాడు, కొత్తపల్లి, కిమ్మూరు సీమలు వగైరా ప్రభుత్వం చేస్తూ ఉన్న రెడ్డి వెంకటప్ప గారు కాలము అయినా తరువాత విస్సామ అనే ఆడమనిషి రెడ్డి వార్ ఇతాలుగు ఆయమ్మ ప్రభుత్వం చేస్తూ యుండేది రెడ్డి వారి వద్ద వాత్సవయా వారు అనే రాజా కుమారుడు రెండువేల మందితో సరదారీ చేస్తూ వుండేవాడుగాను తిమ్మ రాజుగారికి చెంద.... నిమిత్తము పరగణ ముల్లేరు, పరిగణ చాగలనాడు పరిగణ కిమ్మూరు ఈ మూడు పరాగణాలు మన్నెము, తోటపల్లి, జిడ్డంగి, ..... సహా వ్రాయించి ఇచ్చినారు కనుక వత్సవాయి తిమ్మరాజుగారు పెద్దపాత్రుడు లోగడ కట్టించిన పెద్దాపురమనే పేట వద్ద కోటలో ప్రవేశించి పరగణాలు బందోబస్తు చేసుకుని వుండిరి. తిమ్మరాజుగారికి పినతల్లి కుమారుడైన గణపతిరాజు నారాయణ రాజు అనే ఆయనకు .. వ్రాసియున్న గ్రామములో చిల్లంగి వగయిరా కొన్ని గ్రామములు జమీప్యత క్రింద .... చేయించి ఇఛ్చిన్నారు కనుక ఆయన వచ్చి చిల్లంగి కోటాలో మట్టిగోడ కట్టించి గ్రామములు బందోబస్తు చేయించాడు ఈ ప్రకారము జరుగుతూ ఉండగా ఈ వత్సవాయి తిమ్మరాజుగారి కుమారుడు జగపతి రాజు గారు ఆయన కుమారుడు కీర్తి తిమ్మ రాజు గారు గణపతి రాజువారిని కొట్టి చిల్లంగి కోట ఖాళీ చేయించి ఆ గ్రామములు కిమ్మూరు పరాగణాలోనే కలుపుకొని బందోబస్తు చేసుకొన్నాడు తరువాత తిమ్మరాజు కుమారుడు