పుట:Kimmurukaifiyatu00unknsher.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిటీవల కిమ్మూరుసీమ వత్సవాయివారికి స్వాధీనమయిన తరువాతను వత్సవాయ పెదరాయజగపతిరాయలు తమపేరిటన కట్టించిన గ్రామము; జగ్గంపేట, మర్రిపాక, రాపర్తి, వెరసి యీ54 గ్రామములు శ్రీమన్మహామండలేశ్వర కాకతిప్రతాపరుద్రదేవ మహారాజులుంగారు ఆంధ్రదేశం పరిపాలన చేసేటప్పుడు వారితట్టు- నుండి పెదమల్లరాజు, చినమల్లరాజు అనే యుభయులున్నూ ఆంధ్రదేశం ప్రభుత్వము చేస్తూన్నూ తూర్పున రాఘవరాజుసీమ సరిహద్దుకు బెండపూడి అనే గ్రామమువద్దను కొండమీదను గొప్పది వకదుర్గముకట్టించి ఆదుర్గములోను నిలిచివుండేవారు. వీరు 50 సంవత్సరముల వరకున్ను ప్రభుత్వముచేసినారు. వారి తరువాతను కొండవీటిరెడ్లు వారితాలూకు శూనమనాయిడు అనే ఆయన ఆంధ్రదేశమునందు గోదావరిమొదలుకొని తూర్పున కోనపర్యంతమున్ను రాజ్యమునేలుచుచుండెను. ఆయన కుమారుడు ముమ్మిడినాయకేందృడు కోరుకొండ పట్టణమునందు తన తండ్రియైన కూనయనాయకుడు కట్టించిన కోటలో నివాసముగావుండి గోదావరి ఉభయతీరములయందు లిన్ని చాగలనాడు మొదలయిన దేశములు రాచరికము చేసినాడు. యీ ముమ్మిడినాయకుడి శాసనము శాలివాహన ---- ---- అగు నేటి విజయ సంవత్సర ఫాల్గుణ --- బుధవారం నాటిశిలాశాసనము కోరుకొండామిద శ్రీరంగనాయకుని ఆలయమునకు యెదుట నిలువునా పాతియున్నది. తరువాతను కాటమరెడ్డిగారి సత్పుత్రులయిన మారారెడ్డిగారి పౌత్రులయిన వేమారెడ్డిగారు ఆంధ్రదేశము నేలుచునుండి శ్రీమత్కుమారారామదాసక్యాది భీమేశ్వరుని దివ్యమంటపహస్తళమందున పూర్వభాగమున మూడుకోసుల దూరమున వేమవరము అనే గ్రామము నిర్మాణము చేయించినారు. మరిన్ని చాళుక్యభీమవరములో శ్రీ భీమేశ్వర దేవరకును ద్రాక్షారామలో భీమేశ్వర దేవరకున్ను మరి యింకా తక్కిన శివస్తళాలయందును శ్రీపిఠాపురం కుంతీమాధవదేవరకున్ను శ్రీకోరుకొండ శ్రీనృసింహస్వామివారికిన్ని మంటపప్రాకారాదులు కట్టించి భోగభాగ్యాదులు విరివిగా జరిపిస్తూయుండేవారు. యిదిగాక రాజమహేంద్రవరమునకు ఆగ్నేయభాగమునందును ఆమడదూరమునకు పూర్వమున చాళుక్యరాజులు కట్టించిన కొండమీద దుర్గమునకు సామీప్యముగాను గ్రామనిర్మానము చేయించినారు. అది వేమగిరియని వాడుకయై యున్నది. వేమారెడ్డి తరువాతను యీ సంతతివారేవారు రెడ్డి పెద వెంకప్ప అనే ఆయన కొవ్వాడ గురుమిల్లి కూటాల; కొత్తపిల్లి; కిమ్మూరు పోలునాడు; అధికారము చేస్తూవుండి వారివద్ద వరదారుడైన యిసుకపిల్లి పెద్దాపాత్రుడు అనే పాత్రసామంతుడికి కిమ్మూరుసీమ అధికారము చెప్పి ఆసీమవల్ల వచ్చే పైకము పెద్దాపాత్రుడు వశా నవుండి సిబ్బందివారికి వసతుల క్రిందను నియమించి విశేషించిన