పుట:Kimmurukaifiyatu00unknsher.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రుడు జగపతిరాజు యీయనపేరు వుద్దండరాయజగపతి అనే పేరు కలదు. వీరు రాజరికముచేస్తూవుండగా కిమ్మూరుగ్రామానకు పశ్చిమముననాలుగుక్రోశములదూరమున రాజపూడి అనే గ్రామంలోను ఆగ్రామము జాగ్రత్తస్తలముగయుండేది గనుక అవసరాలపెద్దిరాజు అనే ఆయన వక గోలకొండవ్యాపారి అనే వాడుకగల నియ్యోగి ఒకరు కలరు; ఆయన యింటివద్దసీతడు అనేవాడు వక చదురుబోయవాడు వుండెవాడు ఆచిన్నవాడు పెద్దిరాజుగారి దూడలును మేపిస్తూయుండేవాడు వాడు పొలములోకి ప్రొద్దుననే దూడలను తోలుకొనివెళ్లినతరువాతను జాముప్రొద్దు అయిన తరువాతను చద్దివణ్ణము ఆకుతోటి పెద్దిరాజు పట్టుకువెళ్లి పెటుతూయుండేవాడు.