పుట:Kavitvatatvavicharamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము ð í దానం బుల చేత, నుత్తమ పదవికిం దెచ్చిననే కాని యీ దేశ మెన్న టికి శుభములకుఁ బాత్రంబు గాదు. ఇపుడు వేయి సంవత్సరము లుగ మన దేశములలో నుత్పన్నములగు గ్రంథములలో స్త్రీలు గొప్ప దశకు బురికొల్పు వారనుమాట తుట్రాగాలేదుగదా ! ప్రబంధముల లోని నాయికలు ‘ నామీఁద వచ్చిపడు " మనుటదప్ప నింకే యశ స్కరములగు పాటులకైన నాయుకుల ( బురికొల్పుట చూచినారా ? ఇది శుద్ధ పశుప్రాయమైన కేళి. దీనిఁ గామ మనరాదు. అన్నచోఁ బురుషార్ధమును సూచించు నా పదము చెడును ! కామినులు గార్హణీయ లనియు నికర్ష హేతువు లనియు విరక్తి వ్యాఖ్యానము లెన్నియో యున్పవి. తొలుత మగవారు మగతనము గోలుపోవుట చేఁగదా యూడువా రీ పాడుస్థితికి వచ్చిరనుట మఱచి తమ దోషములచేఁ దప్తులై, కీడ్వడినవారిని, దామే దూషించుటం జూడ, మనవారు మనుష్యులా కారా యను సంకోచము రాకమానునా ? ఇంకనైన వారిని మీఁది క్రి ( దేవలయునన్న ప్రోత్సాహ వాక్యములచే ధైర్యవతులం జేయవలయునేగాని తిట్లచే వారు ముందుకు రాc జాలుదురా ?

                         మిశ్రరసములుగాc గావ్యముల దీర్చుట మంచిది
       వట్టి శృంగారమును మాత్రము వర్ణించుట యా రసమునకు వైరస్యముఁ గలిగించుట. మనుష్య ప్రకృతి యెట్టిదనఁగా నే మార్పునుజెందక యేకరీతినియుండు వస్తువులయందు అవధానము చాలకాలము నిలుపఁజాల నియడి ! అవధానమును సుఖమును సమన్వితములు. ఎయ్యది తృప్తికర మో దానియందు మనసుంచుట సులభము, సహజమును. క్లేశకరముల మీఁద బలవంతపెట్టినను మనసు నిలకడఁ గాంచదు. భోజనపు వేళ మితముగ నేయి వేసి కొనిన రుచి, అది దప్ప వేతేమియు లేకున్నను, మఱి యమితముగ నయ్యది స్వీకరింపఁబడినను దానియందు రోయింపు జనించును, ఆరోఁతతోడ మనసును ఇతర పదార్ధము లే మే నున్నవా యని కోప ముతో నలుదెసలను భార్యను పరికించును. ఐరోపాలోని కవులు* ఈ తత్త్వము నతిక్రమింపక వ్రాసిరి. అనంగా కావ్యము లనేక
  • ఇచట నైరోపాలోని కళలఁగూర్చి చెప్పఁబడిన స్తుతియంతయు భారతాదుల రచించిన మనపూర్వులయందును జెల్లును. చెల్లనివారెవరనఁగా దేశక్షయ కాలపు హిందూకవులగు ప్రబంధకారులు.