పుట:Kavitvatatvavicharamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 కవిత్వతత్త్వ విచారము

క్రమముగఁ బోనీక రసముల మిశ్రము చేసి యన్నింటియందు నభిరుచి స్థిరముగ నెలకొను నట్లో నర్చిరి. మన శృంగార కావ్యములు ఏకరస ప్రధానములగుట నీరసములు, వెగటు , రో (త ఇత్యాది జుగుప్పారసములకు నాకరములు .

                                   నీతికి ( గ వితకు { బ్రత్యక సంబంధము లేదు
ఇట్లనుటచే నిటీవలి మన శృంగార కావ్యములు నీతి బాహ్య ములు, చెడ్డవి యని రేఁగుట కారంభించిన పరమ పార్యశుద్ధ్య ధురం ధరులలో ( జేరిన వాఁడనని యెన్నబో కుడీ ! కావ్యము, శిల్పము , నీతిశాస్త్రము గాదు. ధర్మశాస్త్ర ముఁ గాదు. శిల్పము యొక్ష యుత్తర్ష నికర్షముల నేర్పఱుప వలయునన్న దాని రచనా సంవిధానము లC బట్టి నిరూపింప నగునే గాని, భగవద్గీతలయంత పారిశుభ్య మిందులో లేదు. రామానుజ భాష్యము వలె ముక్తిదాయకము గాదు" అని వా పోవుట నిర్నిమిత్త ప్రలాపము. తుదకు గోప్యములC బచ్చిగా వర్ణించినను నీతిశాస్త్రముంబట్టి ఖండించుట తెలివితక్కువ. మఱి రసభంగమూ కాదా యనుటయే శిల్పవిమర్శనము యొక్క ఒక్క పరీక్ష. తక్కిన పరీక్ష లిట యధిక (ప సంగములు. ఆభాసములు. నాకుం జూడ ప్రబంధములయందు మనకుఁ బ్రీతిలేమి కిఁ గార ణము వా నియందు నీతిలేమి గాదు. మఱి రససCషో షకములగు స్థితిగతు లకు వెలియై , రసికుల కెల్ల నవి వైరస్యము మెండుగఁ గల్పించుట. శిల్పము యొక్క ముఖ్యోద్దేశము మనసును హరించుట. ఈ వశీకరణ శక్తి యుండినయెడ నీతి లేకున్న నే కొడు వయు లేదు. అది లేనిచో నుపనిషత్తుల నుడక ఁబెట్టి ధృతియంతయు C దీసి యందు నించినను నే ఫలమును లేదు. కావున మన భాషకు నీతి ముదురునట్లు చికిత్స, దోహదము, ప్రాయశ్చిత్తము జేయవలయునను పరమ పారిశుద్ధ్యదురంధరుల కొక దండము వెట్టి దూరముగఁ బొమ్మను టయే కర్తవ్యము . ఇష్టములేకున్న నీ గ్రంథముల వారు చదువ నేల? ఎవరు ను బతిమా లుకో లేదుగదా ! ఇంట్లో గొళ్ళెము వేసి పాపముల ( జొరనీక భద్రముగా నుండినను సరే. మఱి ధర్మోద్ధరణ క్రియకై పోలీసు వారి శరణుఁ జొచ్చిననుసరే ! మన త్రోవ మనది.
                                        కవిత దేశీయుల నడవడిక సూచకము

పాశ్చాత్యుల యొక్కయు హిందువులమగు మన యొక్కయు శృంగారవాక్యముల తారతమ్య విమర్శనముచేc దేలినవి కవిత్వ