పుట:Kavitvatatvavicharamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 కవిత్వతత్త్వ విచారము స్థలముననే తిక్కెత్తినట్లు చూచుచుండునవి గావు. హిందువులేలో స్త్రీలకుండు స్థితిని నే నేల వివరింప ? వంటిల్లు పడకటిల్లు ఈ రెంటికి వెలియైన నెందులకుం బనికి రాదు ! పురుషు లకు వారికిని దేహసాంగత్యమే కాని మనస్సాంగత్యమెక్కడిది ? వారు చేరి మాట్లాడుట యరుదు. మాట్లాడవలయునని నవీన నాగరికులు పంతము వట్టినను అన్నవస్త్ర విహారాది సరసములు దప్ప నింకేపలుకులకు వీలులేదు ! కావుననే కావ్యకన్యకలు సంభోగ విషయములందప ప నిం కే ప్రపంచము c దెలియనట్టి వారుగా నుండుట, రాజకన్యలు గావున పాపము వంటపనియుం దెలియదు. మఱి తెలిసిన దొక్కటే. ఈ దేశములోని స్త్రీలు విషయవాంఛా పూర్తికి ననుకూలములయిన పాత్రములుగఁ జూడc బడుచున్నారేకాని, పురుషులతో సమానముగ నన్నివిధముల వెలయు శక్తిగలవారు గాఁ జూడఁబడుటలేదు. ఇప్పటివారిస్థితిలో నట్లు చూచుటకును గాదు. బ్రిటిష్ వారి ప్రోత్సాహము సౌరాజ్యము వీని చే నిఁక ముందు బాగు పడుదురేమోకాని, యా యౌన్నత్యము వారధిష్టించువఱకు జీవించి యుండి సుఖించుటకు నావంటివారు మార్కండేయులుగారు 1 *

       కామమనునది పురోవృద్ధి హేతువని యూరోపియనుల భావన. ఎట్లన వరించు స్వాతంత్రముండఁబట్టి యేదేనొక హృదయాకర్షక మగు విశేషము గలిగియో నేర్చియో యున్నంగాని యే కాకులుగా జీవనము గడుపవలసినదే. కాఁబట్టి స్త్రీల మెప్పకొఱకై యెల్లరు శ్రమకోర్చి శక్త్యనుసారము గొప్పతనము నంద (జూతురు. మఱియు స్త్రీలును దెలివి తేటలఁ దే ఱినవారు గాన నట్టివారి సావాసము శ్రేయో హేతువు. ఒకానొక కవి యూదేచించినరీతి శూరుని లక్షణ మే మనఁగా.
        “తే. ఒక్క కాంతనుగోరి, మహెూద్యమములఁ                                                                               బూని సాధించుటలచేతఁ బూజ సేసి                                                                                      రాజ్యమును దైవమును భార్యరాగమడరఁ                                                                                   బ్రితులం జేయుటయు కాని వేఱుగాదు.”                (టేనిసన్)                                                                 అట్లగుట స్త్రీలమీఁది మోహము వీరకృత్యములకుఁ బ్రేరేప కము , అభ్యుదయ కారకము. హిందూ దేశములో స్త్రీలు అధః పతితలై యున్నందున వారి వెంటం బోవుట పాతాళ యాత్ర. మఱి వెంటం బోకున్నఁ దీఱదు గనుక, వారిని, విద్య, స్వాతంత్ర్యము మొదలగు
                      *గాంధీమహాత్ముని ప్రభావముచే నీ పరిణామము ఇటీవల సృష్టికి వచ్చినది. ఇందునకు దేశ సేవిక లొక దృష్టాంతము.