పుట:Kavitvatatvavicharamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిత్వతత్త్వ విచారము

స్వాత్మైక విషయములునైన సుఖములం దప్ప నింకెందును బుద్ధిపాఱుట యరుదాయెను. చిల్లరచింత లెక్కువ. కీర్తికరము లసాధ్యము లైనందున భోగములే పరమార్ధములని గణింపవలసిన వారమైతిమి. జీవితమనునది యుండఁగా కాల క్షేపము పొంటెనైనఁ బురుషార్థ మొకటి యుంచుకొనక తీఱునా ! " వ్రతముపోయె. యశస్సు పోయె! ఇంద్రియానుభవమైన దక్కనీ" యని మనకుం దెలియక మన మనసీజాడల కుపక్రమించెనో ! చూడుఁడు. ఐరోపా వారు శృంగారవర్ణన మెంతో దివ్యముగఁ జేసియున్నారు. వారు రాజసతేజులు. మనలో నాలుకంబట్టినది సత్త్వగుణము. మనసున బట్టినది తమోగుణము.

పాశ్చాత్యుల శృంగార వర్ణనము

వారియొక్కయు మన యొక్కయు శృంగారమునకు ముఖ్య తారతమ్యము లేవనగా : మన వలె వారంగవర్ణనమంతగాఁ జేయరు. చేసినను మొగము కన్నులు మొదలగు బాహిరభాగములమాత్రము ప్రశంసింతురు. మనలో నఖ శిఖపర్యంతము విప్పివిప్పి చూపుట యందఱు నాశ్రయించిన కావ్యలక్షణము. పడకటింటిలోని క్రి వెళ్ళిన వెనుకఁగూడ చెలికత్తె లా మెను వదలినను వదలుదురు గాని కవి యేమో యొుక నిముసమైన వదలఁడు. తెప్పవేయక యశ్లే చూచు చుండును. రవిగానని చోఁ గవిగాంచుట" మనలోని ముఖ్యసంప్ర దాయము. వేదాంత విద్యాదీప్తిమంతమైన యీ పుణ్యభూమిలో నీ రుచి ముదిరి యుండుటకుఁ గారణమేమన, స్త్రీలను జాగ్రత్తగ మఱుఁగున నుంచుటయే ! శీలరక్షణార్థము చేయఁబడిన యేర్పాటే యళ్లీలములకెల్ల మూలము ! ఎట్లన, నివారింపఁ బడిన దానికుండు చవి యనివారితముల కుండదు. చూడవలదన్ననే గదా యన్నింటి కైన నందము ! సమ్మోహనాస్త్రమన్న నిదే ! వలదని యడ్డగించితి మేని దానియందలి వలపు అనర్గళమగును. దమమును జెఱుచునది నిర్బంధము. నిలుపునది స్వాతంత్ర్యము. 'అతిరహస్యముఁ బట్ట బయలు’ అన్నట్లు ఎయ్యది గుప్తమో దానియందే యందఱకు దృష్టి ఇంకను బరిష్కారముగ సాంగోపాంగముగ విమర్శించి చూతమను కుతూహలము సహజము. మనదేశములో నెవతెయైన నొక స్త్రీ నాగరికత గలయది వీథిలోఁ బోవునేని, ఆ యూరివారి కన్నులన్నియు బిఱ్ఱబిగిసి యా మెపైఁబడు. మీకుఁ దెలియదా ? ఈ మర్యాదలేమి కేమి కారణ మెూ పచ్చిపచ్చి విశదవర్ణనలకును