పుట:Kavitvatatvavicharamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 85 నదియె కారణము. చూపునకుండు తహతహను దెరలచే నాCప వచ్చును. మనోదృష్టి మేరమీఱి చూడఁ బ్రయత్నించిన నివారక సాధనమేమి ? సౌమనస్యము. అది మనవారిలో నింకను దగినంత వృద్ధికిరామి తెల్లంబు.

      అంగముల  వర్ణించునపుడును,    ఐరోపాలోని   కవులు   ఆ                                                  యంగము   లేరీతిభావమును  బ్రదర్శించుననుటC  జూపుదురేకాని,                                            భావస్థగీతంబులుగాని   యవి   యసంభావ్యములని   వానిమాటC                                                        దలపెట్టరు.  భావములను  వెలువరించుట  ముఖనేత్రాదులకుఁగల                                                   చక్కందనమున  కాదిమమైనట్టియు హృద్యమైనట్టియు  లక్షణము.                                                    వీనిలోc గొన్నింటిమాత్ర మనుభావము లను పేర మన శాస్త్రకారులు                                                   గణీ0చి, వారాంగనల యభినయము రీతి, శిక్షమేరకు నడుపCబడు                                            త్రిప్పుటలలోఁ    జేర్చిరిగాని,    మొత్తముమీఁద   నంగవర్ణనమును                                                    మనసుతోచc గలసినట్లు చేయుశక్తి,  యీ యాధ్యాత్మిక దేశములో                                                    బ్రుంగుడువోయి యెన్నో శతాబ్దములైనవి.
      స్త్రీల  గుణగణములను శ్లాఘనతో వర్ణించుట పాశ్చాత్యుల                                                               లోని సదాచారము.  ఏలన, గుణముల గణింపక  యూకారమును                                                   మాత్రము  చూచి వలపుగొనుట యా జనములలో     నభావ్యము.                                                         స్త్రీపురుషులు ధారాళముగ నొండొరులతోచc గలసి మెలసియుందురు;                                                 కాన, రూపమునకుఁ దళుకు తక్కువ. ఇCక వలపు జనింపవలయు                                                       నన్న నడవడి, చరిత్రము,  చదువు, సద్గుణములు, కీర్తికరములగు                                        కార్యములయం  దాసక్తి   మొదలగు     నాత్మ    సంబంధములైన                                                          యోగ్యత లావశ్యకములు.  కావున నాయికా నాయకులకు    నివి                                                    యుద్దీపన విభావములగుట వీనిని వర్ణించుట శృంగార కావ్యములలో                                           ముఖ్యము.
       మనవారిలో స్త్రీలకు మనోవికాసములేనిగతి పట్టినది. కావున                                                        రూప మొక్కటియ మోహమున కాలంబనము పశుప్రాయకృత్యమే                                                 కామితార్థము. వీనికిందగిన వర్ణనలమాట చెప్పవలయునా ! ఆపా                                                     రములు.
      పురుషులు గడింప  నెంచు సాహసోద్యమములలో  సైతము                                                          స్త్రీలు తోడుపడఁగలవారని పాశ్చాత్యులనమ్మిక. ప్రకృతిశాస్త్రములు,                                            తత్త్వములు మొదలగు విద్యలC గృషి చేయుటయందును భార్యలు                                                       భర్తలతో సంగమింతురు. వారు సహాధ్యాయులైన స్నేహితు ಲట్లు                                                  నానావాంఛి తంబుల సఫలముఁ జేయఁ జూచుచుందురు గాన,                                                             శృంగార కావ్యములు శుక్రాచార్యుల రీతిని ఒంటికంటితో నొకే