పుట:Kavitvatatvavicharamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము | 9

         తే. జక్కడఁచుచుఁ బేను గ్రుక్కిన పాటిగా
               నిష్టమైన యర్థ మెల్లఁ బడసి
               బ్రతుకుచునికి మీ స్వభావ మింతయును ద
               ప్పదు యథార్థ మనుచుఁ బలుకుటయును.”
                                                            (ప్రభా. ఆ. 1, ప. 108)

        ఆ మాటలనే తనయ పే క్ష కుత్తరంబుగ వనజాక్షుఁడు గ్రహించి తన యుపాయము సిద్ధించెఁగదా యని సంతసించి ప్రద్యుమ్నా దుల నట వేషమున వజ్రనాభపురికింబంప నిశ్చయించెను. నట వేషముననున్న ప్రద్యుమ్నుఁడు వజ్రనాభుసభలో నటించుచుఁ జేప్పిన •

"చ. సకలవిశేష శోథనకుఁ జాలినయో నెరజాణ వజ్రనా
              భకులవతంసరత్నమ ప్రభావతిరోహిత కంటకంబు తా
              వకమగు చూపునాపయి బ్రవర్ధితరాగతఁ బర్వెగాన న
              త్యకలుషవృత్తి నా సుకృతమంతయు నేఁడుసుమీ ఫలించుటల్.
       తే. నీకు నామీఁదఁగల యట్టి నెయ్యమును, మ
              హాదరము నీవు పనిచిన హంసి చెప్ప
              నాత్మలో ననవరత నాట్యప్రసంగ
              మున నిను భజించు వేడుక పునము నాకు."
                                                         (పభా. ఆ, 4, ప. 105, 106)

అను పద్యములును మఱుఁగుననుండి చూచుచున్న ప్రభావతికిఁ దనకూర్మిఁ దెలుపునట్టివ కాన కథకు ననుకూలములే. ఇట్లే యన్ని విషయములును గథానుసారము వచ్చునవియే కాని, ముగ్గురు మూఁడు లోకములైన ముసలిది యమలోక మను మాడ్కి (గథను జీల్చి చెఱుపునవిగావు.

                       భావ లోపములు
          రచనాదోషములు లేకున్నను గళాపూర్ణోదయమునకన్న నిది నికృష్టమనుటకు భావలో పములు కారణములు. ఇందులో వచ్చు స్త్రీ పురుషులు గొందఱే. అందును గృష్ణాదులు పురాణ పురుషులు. వీరి సమాచారము ప్రాఁతకథ. ఇఁక ప్రద్యుమ్ను Cడన్ననో విరహాది వేదనలకు నిదానమైన ప్రబంధపురుషుఁడే కాని యెక్కువ పరి వృత్తి గలవాఁడు గాఁడు. ఇఁక ప్రభావతియన్పనో, నాకుం జూడ నెంతయు నసహ్యురాలు ! రూపమున్నది. నాథుఁడెప్పడు వచ్చి