పుట:Kavitvatatvavicharamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

78 కవిత్వతత్త్వ విచారము

మఱియు కథా ప్రారంభముననే పాత్రములను బ్ర వేశింపఁ జేయుటఁబట్టి కవియే నేరుగ మనకు బోధించుట యే మాత్రము లెదు. అట్లగుటచే వర్ణనలు పాత్రముల మూలము నఁ జేయ(బడి కథలో మిళితములై యున్నవి. చూడు cడు. మొదలెత్తగ నే

“క. శ్రీరమణీ రమణీయమ
               హెూరస్థలుఁ డచ్యుతుఁడు సమజ్జ్వల మహిమన్
               ద్వారక నుండఁ గ నొకనాఁ
               డారూఢాదరత నింద్రుఁ డవ్విభుకడకున్."

అని యింద్రకృష్ణులకు ప్రవేశముఁ గల్పించి, ఇంద్రమా తలి సంవాద రూపమున C బురవర్ణనముం జేసియున్నాఁడు. ఇంద్రుఁడు చింతాక్రాంతుఁడై యుండఁబట్టి పురవర్ణనాదులచే నతనికి మఱపుc గల్పింపఁజూచుట సారధి ధర్మమేకదా ! కావున నియ్యది ప్రబంధ ముల నెల్ల సర్వసాధారణములగు దిక్కులేని వర్ణనలకుం జేరినదిగాదు. మఱి సార్థకము.

      కథతో గాథాన్వయములేని సంగతులు ప్రభావతీ ప్రద్యుమ్నము నందు మృగ్యములు. అవయవముల సంయోగము పరస్పరతయు నిందుంబలె నాంధ్ర గ్రంథముల నెచ్చటం గానము. త్వరపడు వారికి శ్రీకృష్ణుని యజ్ఞము అక్లిష్టవృత్తాంతముగాఁ దోఁపవచ్చుఁ గాని, యదియు c గార్యసాధనమున కుపకరణ ప్రాయము. ఎట్లన, దైత్యరాజు ననుమతిఁ బొందిగాని యేరికిం జొరరానిపురము నేరీతిఁ బ్రద్యుమ్నుఁడు ప్రవేశింపఁ గలఁడని, శ్రీకృష్ణుఁడు తలపో యు చుండఁ గా నాయజ్ఞములో భద్రుఁడను నటునికిని బ్రాహ్మణ

వటువులకును వాగ్వాదము జరుగు కాలములో, వటువులు. భద్రు నుద్దేశించీ.

"సీ. ఏము మ్రుచ్చులమె యూహింప మ్రుచ్చుఁదనాల
                          పుట్టిన యిండ్లు మీ బోంట్లకాక
          యాటవాండ్రని నమ్మి యనుమతింపఁగ నెట్టి
                          పురమైన నశ్రమంబునను జొచ్చి
          పగలెల్ల నాటల బ్రమయించుచును సందు
                          గొందులెల్ల నెఱింగి కొనుచు రేలు
          కన్నగాండ్రగుచు నంగ ళ్ళు ప్రవేశించి
                          యందు నెంతటివార లడ్డమైనఁ