పుట:Kavitvatatvavicharamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 71

                            మలతయును గలిగి జనముల మిగుల బెంపెనఁగు
                            మలయషవనంపు గొ దమలకు మధురత్వం.
                            బలవడిన నీడుమఱి గలదనఁగ వచ్చుఁ గడు
                           వెలయఁగల యీ నుకవి పలుకులకు నెంచన్.”
                                                                   (కళా. ఆ. 1, ప. 186)

అను పద్యము. భావము శైలిని మించినదా, శైలి భావమును మించి నదా యని వెఱఁగొనరించు నగ్రగణ్య పద్యములలో నిది యొకటి! కవిత్వ ప్రశంసల నెన్నింటినో చూచియున్నానుగాని, మనోహరము లైన యిన్ని యాకృతుల నెదురనిల్పి మైమ అచునట్లు చేయుమాటల నింకెయ్యెడను గనలేదు. వినలేదు ! ఊహనుండి యూహకుఁగా బావము మీఁది కెగయుచుఁ దుదకుఁ గంటికి గనరాని యంత యాన్నత్యమును వహించినది గదా !

                             కవికృత శైలివిషయక విచారములు

సూరనార్యుఁడు శైలివిషయమై చేసిన చర్చలను, బహు చమత్కారముగఁ బాత్రము లొకళ్ళకళ్ళ వాక్యములం బ్రశంసించి ನಿಲ್ಲು వ్రాసియున్నాఁడుగాని, తానే నేరుగఁ జదువరుల సంబోధించి నట్లు వ్రాయలేదు. ఈ కవితో సమకాలికుఁడైన షేక్స్ఫియర్' అను నాంగ్లేయ కవిచక్రవర్తి కొన్నియెడలఁ దన శైలింగూర్చి సగము నవ్వటాలకుంబలెఁ బ్రసంగమ్ముఁ జేయందలంచి స్వయముగ వ్యాఖ్యానంబుఁ జేయుట యనుచితంబు కాదు. కథాగమనమునకు విరుద్ధము నని యెంచి, పాత్రముల యొుండొరుల వచనముల విమ ర్శించినట్లు సేసి, యూ మార్గమునఁ గొంతకుఁ గొంత దన యభిప్రా యంబు వెలువరించుట గలదు. సూరన్నయు మార్గ మవలం భించినవాఁడే. నేరుగా కవియే కథలో మాటాడుట కథయందు మన కుండవలయు నవధానమునకును దానిచేఁ గలుగు మైమఱపునకును విచ్ఛేద హేతువు. కావునఁ గవి బోధనలు సైతము పాత్రముల మూలమునఁ బ్రచురించుట నాటక సందర్భమునకుఁ బోషకము. కావ్య మనునది జగత్తురీతి నుండవలయును. ఎట్లన, జగంబు మన యెదుర నున్నది. దానిమీదఁ దృష్టి చెదరకుండుటకో యన జగత్కర్త యదృశ్యభావుఁడయి యున్నాఁడు. కావ్యమును జదివి యానందించుచుఁ గవిని మఱచితి మేని, యది కృతఘ్నత యేమోగాని, యవియే కవియొక్క కృతార్థతకు గుఱుతు. మఱియు, పాత్రల మఱుఁగుననుండి వారిచేఁ జెప్పించినఁ దనకు గర్వము,