పుట:Kavitvatatvavicharamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

70 కవిత్వతత్త్వ విచారము మన సూరకవి కళాపూర్ణోదయమున నీ యన్ని రసములకును స్థానము లేర్పఅుచు కోరికగలవాఁడౌటచే వాని కన్నింటికిఁ జోటుదొరకునంత విశాలమగు కథ గల్పింపవలసినవాఁడయ్యె. అందుచే నిట కథ తుచ్ఛముగాదు, మఱి మిక్కిలియు ప్రాబల్యము గలయది. అయిన నొక దురదృష్టము. ఒకే కథలో నన్నిరసములు నిముడ్పవలెనన్న నా కథను దా అుమాఱుగ నీడ్వనిదిగాదు. అనఁ గా అసంగతమైన యంగములఁ దెచ్చిపెట్టి స్వారస్యము నక్కడక్కడఁ జెడఁగొట్టి కథకు వికారము గల్పించినాఁడని నా మనవి. సమగ్ర పరిపూర్ణత మనుజులకు సుఖముగ జీర్ణమునకుఁ దెచ్చికొను నాహుతిగాదనుట మూ టి మూ టికి జెప్పటయేల? అట్టి కఠినం పుc బదార్ధముల కాసించి కవి కష్టముల పాలైనాఁడు. అయినను మొత్తముమీఁద నీ యిచ్ఛయు శుభకరము. ఇది లేకున్నఁ గళాపూర్ణోదయము ప్రబంధములలోఁ గలసిన గ్రంథముగా నుండియుండునేమో! ఆ దుర్గతికిం దప్పించిన మంత్రము నింద్యమనరాదు !

             కల్పనా సామర్థ్య మీకవికింబలె నాంధ్రులలో మరెవ్వరికిం

గానము. తిక్కనాదులకు నుండవచ్చునేమో ! ప్రత్యక్షమునకు రా నవకాశము లేనివారగుటకతన వారింగూర్చి యీ యాలోచనఁ ಪೆಟ್ಟು కొనుటలో ఫలములేదు. ఇక ప్రబంధకవులన్ననో, ఒక్క కథ యొక్క ప్రధానాంశములయంద కాదు. సందర్భముల నేర్పఱుచుట యందును గల్పనఁ గలవారుగారు. గొట్టెల మంద రీతి నొకరు పోయిన దారినే తల వంచికొని యందఱుఁ బోయరి గాని, స్వేచ్ఛా గమనముఁ దాల్పరైరి. సూరనార్యునియందు ప్రబంధకవులకుంగల వర్ణనా శక్తితోడ కథా కల్పనాశక్తియు, వివిధములైన సందర్భములను సంధానమునకుఁ దెచ్చు ప్రతిభయు, సహవాసములు, మఱియు భావనాశక్తికి దోడు భాషాశక్తియుఁ గలవాఁడగుటఁ దా నే యించు మించు సర్వకవితాలక్షణ సంపన్నుఁడనం జెల్లు గాదె? కవిత్వము భవ్యంబగుటకు భావము భాష రెండును గల సి మెఱయవలయుట. నిత్యసమయము. సూరనార్యుఁ డీ రహస్యము నె ఆలీం గిన వాడనుటకు నిదర్శనమేమనగా : కవితాస్వరూపమును ప్రభావమును వర్ణించి తా వ్రాసిన "లయ విభాతి. చలువగల వెన్నెలలు చెలువునకు సౌరభము

                     గలిగినను, సౌరభముఁ జలువయు దలిర్పం,
                     బొలుపెనఁగు కప్పరపుఁ బలుకులకు గోమలత
                     నెలకొనిన, సౌరభముఁ జలువపసయుం, గో