పుట:Kavitvatatvavicharamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 69

నిర్లక్ష్యములు గాకున్నను నిర్దోషములు గావు.

    సూరనార్యున కీ యుద్యమముచేఁ గలిగిన మేలు గీడు లెవ్వి యన : అపూర్వకథా సంవిధానమునకుం బూనుటచే నుపజ్ఞకు భావనాశక్తికిని మంచి ప్రవేశము దొరకినది. ప్రాచీనకవు లితరుల కథల భాషాంతరీకరించిన వారగుటను, ప్రబంధకవు "లాద్య సత్కథ" లైకొని కై సేఁ తలకుం దొడంగుటచేతను, ఆ యిరుదెఱఁగుల కృతికర్తల యందును మాతృకలులేని యెన్నికలును భావనాశక్తియలి వ్యాపించుటకుఁ దరుణము కఱవాయెను. కళా పూర్ణోదయము సామాన్య ప్రబంధములకంటె నెక్కువ రసవంత ముగ నుండుట కిదియొక కారణము. మఱి భారతమంత సరసము గాని దగుటకు మూల మే మనఁగా సర్వలక్షణములును బలాత్కార ముగనైన దెచ్చి రాసి వేయవలయునని కవి సంకేతము చేసికొన్న వాఁడగుటచే కథ సహజముగc బక్వమునకు రాక యచ్చటచ్చట నూందర వేయబడి యుండుట. అయిన నొక్కటి. కథ కంటికిఁ గనcబడనంతటి కృశత్వము నొంది యుండుట ప్రబంధములలోని కొఱతలలో నొకటియని మును పే చెప్పఁబడియెఁగదా ! ఈ లోప మును చాల మట్టునకు పూరించి ఈ కావ్యములోని కథకుఁ బుష్టి తెచ్చిన తంత్రములలో "సర్వలక్షణ సంపన్న"తా సమయము ప్రముఖము , ఎట్లన, రసములు తొమ్మిది. "శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానక భీభత్స రౌద్ర శాంతము"లని. ప్రతియొక్క రసము నకుఁ జెందిన భావాను భావము లెన్నియో యున్నవిగాని, మనవారు శృంగారమునకుఁ జెందినవానిం దప్ప దక్కినవాని నంతగాఁ దలపోయలైరి. అందుచేత ప్రబంధములలో నన్ని రసములుఁ బ్రదర్శింపఁ బడవయ్యె. అటు చేయవలయునన్న వివిధములయిన కార్య జాలములతో నిండిన విస్తృత కథయొక్క ప్రాపు తప్పక యుండవలయు . ఒక యుద్యానవనమునందు ఒక జత నాయి కా నాయకుల కన్న నొకటి రెండు రసములకన్న నెక్కువ పుట్టించుట దుర్లభము ! రమారమిగా నిర్ణయించితి మేని, ప్రబంధములలో అద్భుతహాస్యభీభత్సభయానక రౌద్రరసములు మృగ్యములు. వీర శాంత కరుణా రసంబులును శోషితంబులు. మనవారిచే శృంగార మనఁబడు " నొక్క రసముమాత్రము దట్టముగఁ గాఱుచుండును.

  • ఇది నిజముగా శృంగారమనుట నిర్వివాదముగామి యిఁక ముందు సూచింపఁబడును.