పుట:Kavitvatatvavicharamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72. కవిత్వతత్త్వ విచారము ఆత్మస్తుతి మొదలగు నేరములు మోపఁబడవు. సూరన శైలింగూర్చి చేసిన విచారములన్నియు బాత్రముల

చాటున కథకును దనకును, భంగము రాని మాడిక్కిc   చేసి
యున్నాఁడు. అనఁగా బయట( బడక య తనకృతినిదానే విమర్శించి
యున్నాఁడనుట.

దృష్టాంతరము. మణికంధరుఁడు చేసిన దండక రూపమైన Š ష్ణస్తవముంగూర్చి కల భాషి ఇది ప్రశంసించిన తెఱంగు : “సీ. పొనఁగ ముత్తెప్పనదుల్పోహళించినలీలఁ

              దమలోన దొరయు శబ్దములఁ గూర్చి
       యర్ధంబు వాచ్యలక్ష్య వ్యంగ్యభేదంబు
             లెఱిఁగిఁ నిర్దోషత నెసగఁ జేసి 
       రసభావములకు నర్షంబుగ వైదర్బి
              మొదలైన రీతు లిమ్ముగ నమర్చి 
        రీతుల కుచితంబులై తనరారెడు
               ప్రాణంబు లింపుగాఁ బాదుకొల్పి

తే. యమర నుపమూదులును యమకాదులు నగు

      నట్టి యర్థశబ్దాలంక్రియలు ఘటించి
     కవితఁ జెప్పఁగ నేర్పు నత్కవి వరునకు
వాంఛితార్ధంబుం లొనఁగనివారు గలరె ?”                                     (కళా.ఆ.1, ప. 185)

භුධි వ్యర్థ పద్యంబు గాదు. ఎట్లన ఇందులోని విశేష ముం జూడుcడు. కలభాషిణి యింక ముందు మణికంధరుని మీఁదఁ దాను దొలినుండియు మోహము దాల్చినదని చెప్పఁబోవుచున్నది. కాన వాని కా మాటయందు నమ్మిక పుట్టుటకై యీ పొగడ్ర యను వయ్యెడి. మఱియు మనసు దగిలినవారల చెయ్వులు బహు ప్రశస్త ముగ మనకుఁ దోcచుట స్వాభావికము, అట్లగుట శైలి యంత బాగుగలేదని పండితులు నిరూపించినను, నీశ్లాఘనకుఁ గోరత రాదు. కారణము లేమనఁగా : అది కల భాషిణి వచనము. ఆమె మనసు ప్రకారము వ్రాయబడినది. అత్యుక్తిగా మీకుc దోcచినను గలభాషిణికి దోcచియుండదు గదా ! మఱియు నామె వారాంగన. వారాంగనలకు, ముఖస్తుతులు ఆతిశయోక్తులును జీవనాధారముగాన నైజములు. కాcబట్టి యహంభావముచేఁ గవి యాత్మస్తుతిఁ జేసి నాఁడని స్థాపింప వలను గాదు. అతని ಾಲಿ చెడ్డదిగా నుండినను సరే ఈ పద్యము సమయోచితమ. ఇఁక శైలి యీ వర్ణనకుఁ దగినదిగా