పుట:Kavitvatatvavicharamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 కవిత్వతత్త్వ విచారము

ఇంతైన వెనుకc బెండ్ కాకబోవునా  ! సూర్యోదయ వర్ణనము

(కారణము మృగ్యము) ఇంక నెవియైన మఱిచిపోయి యుండిన
నిదే సమయమని యీ యన్ని వర్ణనములును, పరిణయము, దంప
తులు పురప్రవేశము చేయుట, ఆ పురములోని స్త్రీలందఱుఁ దొ ట్రు 

పాటుతో వీరినిఁ జూడవచ్చి బదులిచ్చుటకో యనం దమ యంగ

సందర్శనము అందఱకును జేసి ఋణవిముక్తులగుట ! శయ్యా
గృహ ప్రవేశము. చెలికత్తియలు క్రొత్తగా సిగ్గుదాల్చిన కన్యామణికి
నింపైన నీతులు చెఫుట, ప్రథమసంయోగము యొక్ష సాంగూపాంగ

వర్ణనము ! శ్రుతి ఫలము సంతానప్రాప్తి ! ఇత్యాది నానా చిత్ర ములం బ్రదర్శించి యైదవయాశ్వాసము సమాప్తి Cజెందును. ఈ విషయము నే ఆళాశ్వాసముల గ్రంథముగా వ్రాసినను బాధలేదు. అయ్యది కష్టనష్టములకు నతీతము లాభమునకు న తీత మే !

       పాత్రములన్నియు నొక్క తీరుందాల్చిన బొమ్మలు. అలం    

కార శాస్త్ర ప్రకారము చెక్కఁబడినవి. ఆ యా కావ్యములలోని

పాత్రములు నిర్జీవముల యట్టుండుటతోఁ బోయిన నెంతో పుణ్యము! 

అవి కావ్యముల యందలి పాత్రలును ఒండొంటి ననుకరించునట్టి

ప్రతిబింబములు. పేరు ఊరుమాత్రము మార్చియుందురు. ఇంక
నీమాత్రముఁ జేయక వ్రాయ(గడంగనగునా ? స్వభావము, చరి
త్రము, నడవడి, తీరు మొదలగు లక్ష్యగుణము లన్నియు నెరవలి 

సౌత్తులు.

                               వసుచరిత్ర

ఉపజ్ఞ మనకు ఘటిల్లదేని యది యొక గొప్ప లోపమని

చింతించుట మన ప్రకృతి. రామరాజభూషణుఁడు కథాకల్పన
మందు ఉపజ్ఞ లేకుండిన నెంతో మేలని యూదేశించెనుగదా ! ఇది
యస్వాభావికమైన తలపోఁత.  వర్ణనలయం దు పజ్ఞ వ్యాప్తికి వచ్చిన
గృతికి సానవెట్టినట్లని  యూ(తడు సెలవిచ్చి, యూ పద్ధతికి నిదర్శ

నము నేర్పఱుచుటకో యనఁ దన రచించిన వసుచరిత్రములో నత్యద్భుతములు ననన్యసాధ్యములునైన వర్ణనలు బహు చమత్కా

రముగఁ జేసియున్నాఁడు, ఈ మహాకవి చందమునఁ గొన్ని
రకముల వర్ణనములు చేయు వారెవరును లేరు. ఈ వర్ణనలయందు
దోషములు లేకపోలేదు. అందు ముఖ్యములు : అవి కథా వేగము
నకు నడ్డులు. కథ యేలేదు, కథా వేగ మెక్కడిది యని యాక్షే
పించితిరేని నా కుసమ్మతమే. ప్రత్యేకముగ జూచిన మనోహరములై