పుట:Kavitvatatvavicharamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 59

నను గధాంగములతో పొందిక లేనివి. భావనాశక్తిచే న ప్రయత్నము ననర్గళమునుగా వచ్చిన స్వచ్ఛంద ధారలుగావు. మఱి సామ్య శక్తిచే బలాత్కారముగC దేcబడిన యుపమోత్ ప్రేక్షలు. సామ్య మంటిమి. వసుచరిత్రములోని సామ్యములు వస్తు స్వభావములం బట్టి తటస్థించినవియుంగావు. మఱి నా మాది భాషాశక్తిచేఁ గృతము లైన యవి. శ్లేషచే నుత్పత్తికి వచ్చు నలంకారములవలె గొడ్డువారిని నీరసభావములు వేరందు లేవని వక్కాణింప నుద్యుక్తుడనై నందు లకు మి క్షమాపణము వేడెదను. ఇన్ని లోపములుంది నప్పటికిని వసుచరిత్ర మిగుల గొప్ప గ్రంథమనియు, భాషకు మండనాయ మానమనియు జెప్ప నెవడును సంకోచింపఁ బనిలేదు . ఇందు గారణము లెవ్వియనగా: భాషా జ్ఞానమునకిది మంచి యూధారము. పదములలో నెంత సత్తువ యున్నదని చూడగోరు వారికిథీనియంత ప్రయోజన కారియగు గ్రంథ మింకొకటి లేదని చెప్పవచ్చును. మఱియు సామ్యశక్తివలె గవితకు బ్రాణంబు గాక పోయినను సమ్మానార్హములైన శక్తులలో నొకండు. కావున దాని నమేయంబుగ దీపింపఁజేసిన రామ రాజభూషణుఁడు సర్వజనస్తోత్రపాత్రుఁడు. ఇట్టి వర్ణనల కితం డించుమించు ఆదిమ కర్త యగుటచేనవి యొకరి ననుసరించి వ్రాయబడినవిగావు. తన మనస్సున తొలుతc బుట్టినవి. అట్లగుటచే నైజములు. అకృత్రిమ ములు. కాన రుచ్యములు. ఆనందకరములు. శ్లేషాది దుష్కర దుర్బోధ రచనలకుం బూనినను శైలి మంజులగుణముం గలయది. అతిశ్రావ్యము. సాధారణముగఁ జమత్కారము విపరీతముగ నున్న యెడ సుఖముండు టయరది. దృష్టాంతములు. ఏకాక్ష రపద్యములు. ఇందులో సుఖ మేమైనఁ గలదా ? సంగీతములోఁ దలవంపులగు నట్లు దీర్ధాలు దీయుచు స్వరములు వేయుచున్న యెడ "అబ్బా ! ఏమి సామర్థ్యము ! ఎంత సేపు గ్రుక్కపట్టుచున్నాఁడు !" అని ఆశ్చర్యము భరిం తుము గదా ! ఆశ్చర్యమునకు సమానమైన యానంద మెక్కడిది ! కంఠ వ్యాయామ మింత ఘనముగచేయ లేకున్నను సొంపుగా మధురకంఠముతో సామాన్యులైన స్త్రీపురుషులు పాడిన నెంత హాయి ! అనగా కళ యందు రెండు గుణములుఁ జూపించవచ్చును. సుఖము, చమత్కారము. శిల్పము యొక్క యభిమతము సుఖముగాని చమత్కారము గాదని వేఱ చెప్పనేల ? వసుచరిత్ర చమత్కార ప్రధానమయయ్యును సుఖమును బొత్తిగాc బో Cగొట్టుకొన్నదిగాదు. కావున నే దానియందు మనకుండు గౌర