పుట:Kavitvatatvavicharamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 57

జేరినయవి* వీని సామాన్యక థాక్రమం బెట్టిదనిన.

      ప్రబంధముల కథా సార ము

ఒక పట్టణము ఒక. రాజు వీరికేమి గ్రహచారముపట్టినదని తెలియకముంథే ప్రథమశ్వాసము సంపూర్నము.చెవియౌ కనొ జ్ఞానేంద్రియముగ రాజుగారు కన్యామణి యెుకటున్నదని గ్రహించి యందుమతి కొంచెమును గోలుపోవుట. తన స్నేహితునితో విరహ

విషయమైన ప్రసంగము చేయుచుఁ గన్యామణి శరీర మేమాత్రము
విడువక విమర్శించుట! వేఁటకుఁ బోవుట ఇత్యాదులు. ద్వితీయా  
శ్వాసము ముగిసెను. కన్యామణి మాత్ర మూరకుండునా యేమి ?
ఆ యమ్మ తబ్బిబ్బు ఇంతంత యని చెప్పఁగాదు. శ్లేషలు వెట్టన
నేమి తృప్తి ! శ్లేష లు వెట్టినఁ గొంత పర్వాలేదు. తనవలెనే చంద్ర
ముఖులైన చెలకత్తె లం జేర్చుకొని నాయకుని సౌందర్యవిషయమయి
యొక రెండు గంట లుపన్యాస మిచ్చువేళకు మూCడవయాశ్వాసము
ముగింపునకురా రాకేమి చేయును?  కన్యామణి యొక్క కాఁకకు నుప
శమనము చేయుటకై చెలు లా మె నుద్యానవనమునకుఁ బిలిచికొని

పోవుట సరోవర సందర్శనము. ఆ ప్రాద్దు మాత్ర మందఱును స్నానముఁ జేయుట, చన్నీళ్ళువడు వేళకు గగుర్పాటు వణకు

మొదలైన శృంగారావస్థలు  తిక్కెక్కినట్లు ప్రబలుటయు, యజ

మానురాలిని చివురుటాకుల శయ్యపైC బరుండఁజేసి వస్త్రములు

సడల్చి శైత్యోపచారములు చేయుటయు, నవియు నిష్ఫలంబగు
టయు, చంద్రోదయ వర్ణనము. ఏమో వినోదము చూతమని
వచ్చిన చంద్రుని నా శుకపిక వాణు లందఱుఁ గలసి యేకకంఠ
ముగC దిట్టుటయు,  మలయమారుతమన్మథదూషణము మొదలగు
నోరూరఁ జేయు సంగతులు గలిగి
           “క. సర్వజనంబులు చదువ న
            ఖర్వంబగు కౌతకంబుఁ గాంచెడు తెఱఁగుల్
            పర్వంగఁజేసి నాల్గవ
            పర్వంబది యస్తమించు భామినులలరన్ !"

  • మనుచరిత్రము వసుచరిత్రము వీనికి నడుమ వ్రాయఁబడిన గ్రంథములును ఇంత గుణశూన్యములుగావు. ప్రబంధ ధోరణి మిక్కిలి ప్రకటనమునకు వచ్చిన తదనంతర కాలపు గ్రంథములు హీనములు. చేమకూర వేంకటపతి కృతులు దప్ప

అను సమయము గూఢము. (8)