పుట:Kavitvatatvavicharamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 కవిత్వతత్త్వ విచారము అను పద్యమును జూచి మణికంధరుని తపోవనము వర్ణించుచుఁ బింగళి సూరన్న పైరీతి ననుకరింపం జూచియు యమకమునకై స్వారస్యముఁ జెడఁగొట్టుకొన్న గతియు గా ంచుcడు ! సీ. ఆవులునాకఁ గన్నరమోడ్చు పులులును బులుల చన్లుడు వంగఁబోవు లేళ్లు లేళ్ళ చల్లాటరంజిల్లెడు హరులును హరులు గోళ్ళనుగోక నలరుకరులు కరులకటాళి వైఖరినాడు పాములు పాములఁ బాలించు బభ్రుతతులు బభ్రుతతులప్రక్కఁ బాయనియెలుకలు నెలుకలఁ బెంచుపిల్లులునుగలిగి భారతపద్యములోని సొగసు దీనియందు లేదు. ఏలన, అందు జంతువులకునుండు నన్యోన్యతను జూపుటలో నిష్కారణ చేష్టలు వర్ణింపక హేతుసంగతములగు చర్యల నారోపించుటయే కాదు. "భూ సుర ప్రవరులు భూతబలు లైచ్చిపెట్టు నీవా రాన్నపిండతతులఁ గడఁగి భక్షింప" ఇత్యాది విశేషముల చే నా మృగములకును ముని జనులకును గల మచ్చికను సూచించి యున్నాఁడు గాన నీ వర్ణనము మనోహరముగా నున్నది. సూరన్న పద్యములో పదములచే నర్థము నిర్ణయమునకు వచ్చినది గాని, యర్ధవ్యక్తికై పదములు ప్రయోగింపఁ బడినట్లు గానము. మఱియు జంతువుల పట్టినిగూర్చి యది దానిని గీరెను, ఇది వేరొక దానిని గోఁకెను, అనుటలో మనోదృష్టికి నింపైన రూపములు బ్రత్యక్షముగఁ గానరావు. "కడఁగి భక్షింప నొక్కటఁ గలసి యాడుచున్న" యను మాటచే నాటలో మచ్చిక పడిన జంతు వుల చెల్లాటములు స్ఫురణకు రాకపోవునా ? భీష్మాటోపమును వర్ణించుచున్న భారతములోని కొన్ని వచన ముల ననుసరించి, కళాపూర్ణోదయములో అష్టమాశ్వాసములోని "ఇత్తెఱఁగున నప్పార్థివోత్తముం డత్యంతచిత్రంబైన" ఇత్యాది దీర్ఘ వచనములు వ్రాయంబడియున్నట్లు దోఁచెడిని. "సూరనార్యుడు కొన్నియెడల నన్నెచోడుని నను క్రమించి యున్నాఁ"డని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వ్రాసియున్నారు. శ్రీనాథుని వైఖరియు నీ కావ్యమునఁ గొన్నిచోట్లఁ గానవచ్చెడిని. కవులయందు C గాన్పించు నిట్టి సాదృశ్యములు విచార్యములైనను మిలి ముఖ్యములని భావించుట తగదు . పోలికలంబట్టి చౌర్యము నొడిగట్టుట తగదు. సందర్భము లభిన్నములుగ నున్నచోట్ల భాష యు ఁ గొంత సాదృశ్యముం దాల్చుట య ప్రకృతము గాదు. విషయము, శైలి యివి పరస్పర సమన్వితములు. అట్లగుట విషయ సంభూతమైన పదసాదృశ్యము కావలయునని తెలిసి తెచ్చిపెట్టు