పుట:Kavitvatatvavicharamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 53

కొన్న కల్పనయని సంశయించుట పొరపాటు. అయినను సాదృశ్య ములు విశేషించి బహుళముగ నుండిన నితరులఁ జూచి వ్రాసి నాఁడను నిర్ణయ మనివార్యమ. "పిల్లవసుచరిత్ర"ము లనంబడు నిటీవలి ప్రబంధము లన్నియు రామ రాజ భూషణుని బిచ్చములు కావా? ಇట్లు మన సూరన యుత్కృపులైన గ్రంథకర్తల జాడల నెఱిఁగినవాఁడయ్యుఁ గొంతవ అకు నంత మంచివి గాని మార్గముల నవలంబించియున్నాఁడు. దీనికిఁ గారణమేమనఁగాఁ ఎట్టివాఁడును దన కాలములో Uశేషములని యెన్నంబడిన రీతుల విరచింపఁ జూచుట సహజము. సమ కాలికుల మెప్పలువోలెఁ దీపియైన మెప్ప లెవ్వి ? మఱియు మనకవి మిగుల బీదవాఁడు గాబోలు ! ఈ యను మానమున కాధారములైన యంశములు గొన్ని శ్రీ వీరేశలింగము గారి కవి చరిత్రలో సూచింపఁబడి యున్నవి. కుటుంబ రక్షణార్థము ద్రవ్యార్జనమునకై యత్నించుట దోషమా ? కాదు. ఆ కాలమున నిప్పటియట్లు ప్రజలు పుస్తకములఁ గొనుటచే నాదాయము గడించి జీవింపఁ జూచుటకు వీలు శుద్ధముగ లేమింజేసి, యితఁడు రాజుల నాశ్రయింపవలయు విధికి లొంగిన వాఁడాయెను. బమ్మెర పోతన వలె " మదంబ నిను నాఁకటి క్రిం గొనిపోయి యల్ల కర్ణాట SびPもD కీచకులకమ్మఁ ద్రిశుద్దిగ నమ్ము భారతీ" యుని చెప్పఁజాలిన ధీరులు వేయింటి కొకరైన నున్నారో లేరో ! రాజాశ్రయమున బ్రదుకుపాటు గోరు వారు వారి ఇష్టానుసారము వ్రాయక యేమి చేయుదురు ? ఇఁక రాజులన్ననో పరిపాలన కార్యములఁ దగిలి కాలంబు గడుపువారు. సొంతమగు బుద్ధితో విమర్శింపఁ జాలినంత పండితులగుట యరిది. కావున నట్టివారాచారముంబట్టి గుణదోష నిర్ణయముం జేయుట నైజము. సూరనార్యుని కాలములో ప్రాచుర్యమునకు వచ్చిన కవితారీతి ప్రబంధ రచన. అట్లగుటఁ దానును బ్రబంధ ధోరణి నే వ్రాయవలసిన వాఁడయ్యె. ఐనను భావగంభీరుఁడును వివేక వంతుఁడును అగుటంబట్టి సంపూర్తిగ ప్రబంధ రీతి కూపంబునం బడలేదు. ఒక యడుగు గట్టున, ఒక యడుగు పల్లమునఁగా నిలిచి, తన యిష్టమునకు రాజుల యిష్టమునకును రెంటికిని మధ్యమున, సంపూర్ణముగ నిగ్రహముగాని యనుగ్రహముగాని 53), త్రిశంకుస్థానమున నిలిచెను. "అన్యు మనముల్", నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాఁడు ధన్యుఁడు" గదా ! ఈ కవి ధన్యుఁడాయెనో లేదో ఆయన లెక్క పుస్తకములు మనకు జిక్క