పుట:Kavitvatatvavicharamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 49

మనకు బ్రసిద్ధములగు హేతువులంబట్టి సత్యా సత్య నిర్ణయము కేయఁబూనము. (ii) ఇట్టి ప్రకృత్యతీతముల వర్ణించుచో నున్న ుండి యూధునికములు సామాన్యములు నైన సంగతులను వేయు గూడదు. వేసిన జాలమునకు భంగము. ఆ మాయను స్థిరముగఁ దోషించునట్టి వర్తమానములఁ బొందించుచు నేక ధోరణి నే యేగుట యుత్తమము . కళా రచనలో గమనింపవలసిన విషయ మేమన, రసా బాస మే మాత్రము గలుగనంత పొందిక యున్నదా లేదా యును ట. విషయము ప్రకృత్యతీతమైన నేమి, ప్రకృత్యధీనమైన నేమి ? విషయము కన్న రీతి శిల్పములం బ్రధానము. కావున లోకుల కెల్లరకు రుచ్యములు గానుండు భారతాది వీర కావ్యములయందును, కథాసరిత్సాగరము మొదలైన వినోద కథల యందును గల ప్రకృతిని మీరిన వర్ణనలకు నాధారభూతమైన భావనాశక్తి గణనీయము గాదనుట తప్ప. మఱి యయ్యది యు మనుష్యుల యందు అనశ్వరముగ నుండు నే వో కొన్ని భావములకు సహజముగ ననుకూలములైన ప్రకారముల వర్తించునదియ యనుట యొుప్ప. అట్లుగా దేని నా కథల యందు. మన కెడతెగని మక్కువ యుండు టేల ? ఈ కాలమున బిడ్డలెట్లో పూర్వకాలమునఁ బెద్దలునట్లే. అనగా ప్రకృతిజ్ఞానమంతగా లేనివారనుట. ఇది యొగదా ప్రాచీన గ్రంథ గాథా పురాణము ల లో మన నమ్మికకు నందని యద్భుతములు విస్తార ముగఁ జెప్పఁబడి యుండుటకు మూలము! ఆ పురాణ కవులకు నవి యస్వాభావికములుగఁ దోcచియుండవు గాఁ బోలు! వారు ఘనమైన నమ్మకము విశ్వాసమునుంచి వ్రాసిరి. కావున నే మనకును నవిశ్వా సము అంతగాఁ బుట్టకుండుట. ఇప్పటివా రారీతి వ్రాయcజూచిరేని యసాధ్యమని చెప్పఁగాదు గాని యెంతో శిల్ప నైపుణ్యము లేనిది యవి కృత్రిమములుగా దోcచుఁ గాని నిక్కములట్లు భ్రమగొల్పఁ జాలవు. కావున నాటకములలోను గావ్యములలోను నాగాస్త్రము గారుడా స్త్రమును బ్రయోగింపఁకుండుటయు మొత్తము మీద సుగు ణము. అట్లుగాదని వాని నా వాహనము జేయువారు వానితో నాగ్నే యూ స్త్రమును రప్పించి గ్రంథమంతయు నా హుతి గా నిచ్చినయెడ లోకము నకెంతే ను పకారము చేసినవారగుదురు !


  • స్వభావా తిక్రాంతవిషయములఁ గూర్చి సత్యతాభ్రమ సిద్ధించినట్టు వ్రాయం జాలు పాశ్చాత్యకవు లిపుడుఁ గొందఱున్నారు. ఆంధ్రమున నీ ప్రతిభగలవారున్నా రేమో గాని నే నెఱుంగను, వీరేశలింగంగారు దప్ప.

(7)