పుట:Kavitvatatvavicharamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 కవిత్వతత్త్వ విచారము

ఎఱ్రాప్రెగ్గడ రచించిన

ఉ. “అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారదచంద్రద్రచంద్రికా
డంబరచారుమూర్తి ప్రకటస్పుటభూషణ రత్నరోచిరా
 చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్ష వివిక్త నిజప్రభావ “భా
 వాంబర వీధివిశ్రుతవిహార" ననుం దయఁజూడు భారతీ !”

యును సరస్వతీస్తవమున కవితాధిదేవతం గూర్చిన " భావాంబర వీధివి శ్రుతవిహార" యను సంబోధన మెంతసత్యము ! మఱియు గంభీరము

భావనాశక్తి యనేక మాయలం బన్ను లీలా వినోదిని. ఈ మాయల కన్నిఁటికి సామాన్యలక్షణ మొక్కటియే. ఏ రసము నుత్పాదింపఁ జూచునో దానిని కవియే మనఃపూర్ణముగ దాల్చినఁ గాని చదువరులయందు అభిమతమగు చిత్తవిభ్రమము గలుగ నేరదు. భావము లనంతములు న గాధములుగా C బ్ర భవిల్లినఁ గవియు నమోఘుc డగును.కవిత యొక్క గుణదోష నిర్ణయమం గూర్చిన యాధార తత్త్వముల( గొన్నింటిని నివేదింప సాహసించితి. మన్నింతురు గాక ! గ్రంథ వైపుల్యమునకుం జడిసినవాడనై దృష్టాంతములఁ దఱుచుగా బొందింప నైతి. క్షమింపుడు! ఈ వాఖ్యానమునం దేలిన యంశములు:

(i) అంతా కవులము గామా
యంతంతగఁ గందపద్య మల్లఁగలేమా ?”

యని భాష మొదలగు వానిని మాత్రము కృషి చేయుటచేఁ గవు లగుదుమనుట బొంకు. (ii) శైలి భావ ప్రకాశకము. శైలి, భావము ఇవి వియోగములేని ద్వంద్వంబులు. (iii) అట్లగుట ప్రాచీనకవులు ఆలం కారికులు మొదలగువారు చూపిన జాడల ఉచితముగ నుపయోగించిన మేలు చేయునవియే యైనను, అవియే సంపూర్ణ శరణ్యములని యెంచి యా మార్గములను మీఱి యొక యడుగైనఁ బెట్టగూడదనుట కవితాశక్తికి భయంకరమైన యూహ. (iv) ఆది కవులు భాషాంతరీకరణముఁ జేసినవారు గావున నపూర్వ రచనా సామర్థ్యము వీరి కున్నదో లేదో తెలియదు. అనగా వీరి కుపజ్ఞ యే మాత్ర మున్నదనుట వివాదాంశమే మో ! అయినను మీఁద వివ రింపబడిన గుణములఁబట్టిచూడ కవుల లక్షణములు పెక్కులు వీరియందున్నవనుట స్పష్టము. అందును దిక్కన మహాకవి యొక్క ప్రభావము అజేయంబు. అద్వితీయంబు !