పుట:Kavitvatatvavicharamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 కవిత్వతత్త్వ విచారము వర్ణనా ప్రావీణ్యమునఁ దిక్కనతో సమాను లెవరును లేరు. అరపా లైనవారును లేరన్న సత్యమునకుఁ దల వంపు రాదు. పనికి మాలిన యలంకారములు వారి కవిత్వమున నపరిమితములు గావు. తుదకు వర్ణనములకుం బూనునపుడు సైతము కథ యొక్క వేగమునకు భంగము గలిగింపనంత మితముగఁ జేయుదురేకాని కథ మఱపు నకు వచ్చునంత దీర్ఘముగా నెప్పడును సాగఁబెట్టరు. అనఁగా నిక్కమైన కవిత వీరియందు నెలకొన్నదని నా విన్నపము. అందు ( దిక్కనను గూర్చి నా వంటి వాడు ప్రశంసింప జూ చుట యధిక ప్రసంగము. అతఁడు కవిబ్రహ్మ. అవతారపురుషుఁడుగాని కేవల మర్త్యుడా యని యాశ్చర్యపడవలసినంత ఘనుఁడు !

                     విషయము శైలి రెండును ముఖ్యములు\

" భారతమునందు మనకంత రుచియుండుటకుఁ గారణము. విషయము, అనఁ గా కథ గాని, యూ విషయము ప్రదర్శింపబడిన మార్గములు, అనగా శైలి ఇత్యాదులు, గావని" కొందఱ యభిప్రా యము. కాని యిది శుద్ధముగా బుద్ధిపొరఁబాటు మాట. దృష్టాం: తము : భాస్కరుని రంగనాథుని* రామాయణములం జదివినవారు రామ వియో గముచే శోకించు కౌశల్యాదశరథాదులయెడ నెంతో ప్రీతియు జాలియు వహించినవా రగుదురుగదా ! అయ్యలరాజు రామభద్రుఁడను కవి తన రామాభ్యుదయములో రామ వనవాస ఘట్టమున దశరథుఁడు "నానార్థరత్నమాలను ఎదుట నుంచి కొని, పుటలఁ ద్రిప్పచు నేర్చినాఁడో యనునట్టు దరిద్రముపట్టిన శ్లేషా లంకారములు పెట్టి

సీ. శ కానక కన్న సంతానంబు గావునఁ గానక కన్న సంతానమయ్యె నరయ గోత్ర నిధానమై తోఁచుఁ గావున నరయ గోత్రనిధానమయ్యె నేఁడు ద్విజకులాదర వర్ధిష్ణుండు గావున ద్విజకులాదరణ వర్దిష్టుఁడయ్యె వివధాగమాంత సంవేద్యుండు గావున వివిధాగమాంత నంవేద్యుఁడయ్యెఁ

  • రంగనాథ రామాయణమును రచించినవాఁడు కోన బుద్దారెడ్డి. రంగనాథుఁ డనెడువాఁడు కట్టుకథలకుఁ జేరిన కవియకాని వా స్తవ్యుఁడు గాఁడు.