పుట:Kavitvatatvavicharamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 'ప్రథమ భాగము' 31

తే.

గటకటా ! దానర సముత్కట కరీంద్ర
                       కటకలిత దాన ధారాస్త్ర కటకమార్గ
                       గామి, యెట్లు చరించు నుత్కట కరీంద్ర
                       కటక లిత్ర డాన ధారాష్ట్రకటక తటుల ?"

   ఇత్యాదిరీతులఁ బ్రలాపించినట్లు వ్రాసియున్నాడు. మఱియు శంకరకవికృత హరిశ్చంద్రోపా ఖ్యానమున లోహితాస్యుని మరణము గూర్చి యేడ్చుచుఁ జంద్రమతి, రాజర్షి పత్ని గావున నేమో, కుమారునికింబలె తనకును నూపి రాడకుండఁ బ్రాణాయామముఁ జేయుచు నీ దీర్ఘ సమాసమును గూర్చి పద్యము చెప్పినది చూడుఁడు.

మ.

“అకటా ! చేరెఁడు నేలకుం దగఁడె సప్తాంభోది వేష్టిభవ
                      త్స కలద్వీపకలాప భూపమకుటాంచ త్పద్మరాగోజ్జ్వల
                      ప్రకటానర్గళ నిర్గళత్కిరణ శుంభత్పాదుఁడైనట్టి రా
                      జుకుమారుండు'

(ఆ. 5, 86 ప.)

                ఈ తీరు ననే యెల్ల రామాయణములును వ్రాయబడియున్నచో నా గ్రంథముల యొద్దకు మనుష్యులన నేల, తుదకు జెదలుసయి తము పోదను ట స్పష్టము . కాబట్టి విషయముచే రసము తప్పక కలుగున నుట తప్ప. కథ బాగుగ నుండి న జాలు నా ? తగిన రీతిని వ్రాయంబడియున్నంగాని కాదు. ఈ దేశములో నొక్యాంధ్రులకుఁ దప్పఁ దక్కిన యుందఱకును రామాయణమందు cగల యభిరుచి భారతమున లేదు. మనకన్ననో భారతము ప్రాణము. ఈ వ్యత్యాసమునకుఁ గారణమేమి ' ఆంధ్రంబున భారత రామాయణాదులకుఁ గల శైలి తారతమ్యమే. శ్లోకరసము వర్ణించునపుడును, రామభద్రునకు శ్లేషలు సాంస్కృతిక దీర్ఘసమాసములును వీడరాని చీడలాయోcగా ! యుద్ధము ముగిసి జయము సిద్ధించిన పిదపCదాఁజేసిన యకృత్యములC దల cచి కొని ధర్మరాజు పశ్చాత్తాపపడు ఘట్టమునఁ దిక్కన్న వ్రాసినవిధముంజూచిన భారతము నకు మన యంతరాత్మలయందుగల నిత్యనివాస మునకుఁ గారణ మేర్పడకపోదు. చూడు Cడు.

ఆ.

అల్పకాల భోగ్యమైన రాజ్యమునకుఁ
                    గా, ననల్పకీర్తి ఘనుని, జరఠ
                    సింహకల్పు, వంశ శేఖరజన్ము, ద్రుం
                    చితి, మనంబు పగలఁ జివుక కున్నె?

(భా.శాం.ప్ర. 197 ప..(