పుట:Kavitvatatvavicharamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 29

తే

. అకట! యుత్తర యొప్పెడునది, మనంబు
దీనికెంతయు మెత్తన, యేనునిన్ను
 వేఁడి కొనియెద ! వచ్చి యివ్వెలఁది వంత
దీప్తి తళుకొత్తు పలు కులఁదేర్పవన్న !”

(భా. (ඩී. ద్వి. 733)

ఈ మాట యెంత సత్యము ! జయమగునేని ప్రపంచమం తయు పెండ్లిల్లే ; పరాజయమేని పాడిల్లే ! కావున నేకదా వేమన తనచావు జలప్రళయము తనదుఃఖమె సర్వలోక దారిద్ర్యంబున్" అని నుడు వుట ! విపరీతాలంకార రచనకు బ్రేరేపకము భావశూన్యత ఇంగ్లీషుక వులకంటె నాంధ్రకవులలో నలంకారము లధిక ములు. అందును బ్రబంధకవులలో నత్యంత విపరీతములు. దీనికిఁ గారణమేమన, అలంకార రచన యూలోచనాశక్తికిఁ జేరి నంత భావనాశక్తికిఁ జేరినది గాదు. మనకవులు తరుచు పండితులు. ఇంటిలోనే కూర్చుండి నిఘంటవులఁ గంఠపాఠము సేయువారు. వీరికి కార్యోత్సాహము భావప్రాబల్యము రెండును క్షీణములు. కావున నే భావనాశక్తి మట్టు. ఒకవిధమైన యాలోచనాశక్తి యెక్టువ కాన రేపగలును ఆలోచించి యాలోచించి దిక్కు గతి మోక్షములేని యూహలం గల్పించుచు నదియే కవిత్వమని విజ్ఞవీఁగసాఁగిరి. యుక్తులు కుయుక్తులుఁ గవితాశక్తి యగునా ! కానేరవు. కవి త్రయము వారిలో నిట్టి విఱుపులు లేవని చెప్పఁగాదు గాని ప్రబంధ కవులయందు బలెపిచ్చి ముదిరియుండలేదనుట సర్వజనవిదితము. ఒక వేళ మన దేశ భాషలలో నలంకారములకు స్వచ్ఛందమైన ప్రవృత్తి యాంగ్లేయ భాష లకన్న నెక్కువయో మో! భాషా శాస్త్ర వేత్తలు గొందఱు మనలో గుణవాచకములు వలసినంత లేకుండుటచే విషయవైశద్యప్రాప్తికై యలంకారములతో నిండిన శైలి నా రాధింప వలసినవార మై తిమని సిద్ధాంతము きさ。 యున్నారు. ఇదియు సహేతుకమైన వివరణ వేయని తోఁచెడని. భారతకవల ప్రతిభ ఈ విస్తార వ్యాఖ్యానమునకు ప్రకృతి సాంగత్య మెట్టిదనంగా భారతకవులకు భావనాశక్తి యెంతయు గంభీరము. సమయోచిత