పుట:Kavitvatatvavicharamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 కవిత్వతత్త్వ విచారము

కావ్యములను వల్లించు చుండుటచేత నూనెకు నష్టియే కాని కవితకుఁ బుష్టి లేదు. తనమనసున నెన్నియో భావములు ప్రభవిల్ల కున్న నితరుల మనసులలో భావము లుప్పతిల్లC జేయుటయెట్లు  ? కట్టెవారిన కోవిదులకన్ న లోక వాసనల ననుభవించి యానందించు వారు మేలు.

అలంకారము లనావశ్యకములు

మన కావ్యములలో నుపమాద్యర్థాలంకారములును నను ప్రాసాదిశబ్దాలంకారములును దఱుచుగ నుపయోగింపCబడి యుం డుట, యెల్లరకుఁ దెలిసిన సంగతియ. అందు శబ్దాలంకారము లంతగా ముఖ్యములు గావనుట యందరు నొప్ప కొందురు. గా నవానిమాట ప్రస్తుత మటుండనిత్తము. అలంకారములలో ప్రధాన మైనవి యుపమోత్పే ఔదులు. వీనికి మూలభూతమైన ధర్మ మేదనగా ప్రకృత వస్తువునకు మతేదో యొక వస్తువునకును నామ రూప స్వభావాదులంబట్టి సామ్యము గల్పించెడుశక్తి. పోలికలను స్థాపించుట సొగసైన కార్యమేయైనను గవితకు ఖండితముగా నుండవలసిన లక్షణము కాదు. మనవారు అఅంకారముల యెడ నమితాతురతc గొన్నవారు కాఁబట్టి యొుకటి రెండు కారణముల ఁ జూపుట యావశ్యకము. శిల్పములకు వర్ణన మప్రధానము. కాదను వారెవరును లేరు. ప్రతిమలను జిత్రించువారును విగ్రహములఁ దీర్చువారును బరిస్ఫుటముగ నాకృతులనెదుర నిల్ప నేర్తురుగదా ! అయిన నట్టిచో వీరు పోలికలందెచ్చి చూపి పరిష్కరించుట కవకాశ మెక్కడిది ? గద్య పద్యములును శిల్పమునకుం జేరినవే. కాననిందును సాదృశ్యప్రతిపాదనము విడువరానిది గాదనుటయ సరి. మఱియు భావములు తీవ్రముగఁ జెలరేగునపుడు వానియుద్భ వోద్రేకములకు హేతువులగు వస్తువులం దప్ప నితరములయెడ దృష్టిపారుట యసంభవము . మనసు చెలరేగినప్పడు ఆలోచనకుం బూనుట యాచిత్య భంగమునకు ముఖ్య కారణము. కావున నే మనవారు కోపము వచ్చినపుడు ౧, 9, 3 ఎంచుమని చెప్పదురు. చూడుఁడు. భీమసేనుఁడు దుర్యోధనుని జూచినాఁడు పో ! అపుడు. సింహము మదేభము పైఁ జెలఁగినట్లు, డేఁగ పావురము మీఁద వ్రాలిన మాడ్కి, ఇంద్రుడు వృత్రాసురుని మార్కొనువిధమున, బల్లి చీకటీఁగపై గవిసిన కరణిని ఇత్యాద్యుపములు భీమసేనునికిఁ దట్టునా ? " క్రోధం బప్రతికారమై హృదయముం గుందించు"