పుట:Kavitvatatvavicharamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 27 నవసరమున నిట్టిదూరపు టాలోచనలకుఁ దా వెక్కడిది ? ఒక వేళ అరమైలు దూరమునఁ జెట్టుచాటునఁ బొంచిచూచెడు కవులకైనఁ దోఁచునా ? తోఁపవని నానమ్మిక. ఏలన, భీమసేనునిజూచి వణఁకు చుందురుగాన ! కావున కథాంశము సాక్షాత్తుగ సమీపమున నడచి నట్లు భావనాశక్తి బలంబుచే స్ఫురించెనేని దూరపు సంబంధముగల బలాత్కృతాలంకారములకుఁ దా వుండదు. సాదృశ్యములలోఁ గొన్ని సహజములును అనివార్యములును. అవి తమంతటన యే ప్రయాసమును లేక వచ్చినయెడఁ గథా సందర్భముతోఁ గల సి మెలసి యుండును. ఈ విషయమునందు బ్రథమోదాహరణము కాళిదాసుని సాదృశ్యకల్పనము. చూడుఁడు. తే. “అట్టి సంతతిలేని న నెట్లుగనుచు వంతఁ జెందవ మది మౌనివర్య! చెప్పమ ! ప్రీతిమైదాన నిర్వోసి పెంపఁదుదకు గొడ్డువాటిన యాశ్రమ కుజముటోలె* మణికొన్ని సర్వవిధముల సరిపోలఁజాలు నో గోవిందా ! యను చున్నను దీర్ధాలోచనములుచేసి కష్టపడి శ్లేషాది కుయుక్తిపాశ ములచే నీడ్చి తెచ్చి తొందర మెయిఁ జొన్పించినట్టులుండును. ఇట్టివి సంపూర్ణముగ విసర్జించిన నెంతయో బాగు. అలంకారములం గూర్చిన ముఖ్యపద్ధతు లెవ్వియన, అయ్యవి ప్రయత్నములేకయ వచ్చినంత సహజముగ నుండుట. కథలోని స్త్రీ పురుషులు మాటాడునపుడు పాత్రోచితములైన కొన్నింటిమాత్ర ముపయోగిం చుట కవియే వర్ణించునపు డొకింత యెక్కువగ నలంకారములు వాడినను దోషములేదు. కాని భావములు మహెూజ్జ్వలములుగ రేగునపుడు ప్రకృతమునందే యవధానము నింపట మంచిది. అట్టి తరుణముల నలంకారములు సాధారణముగ నసంబద్ధ ప్రలాపముల. సాదృశ్యతత్త్వము సామ్యము వర్ణనకు నుపకరణము. ప్రధానంబు గాదు. సామ్యము లుండిననేమి యుండకున్ననేమి ? సొగసైన వస్తువును జూచిన వెంటనే తనంతట సంతోష ముదయించును. ఈరీతినే సమస్తవస్తువుల యనుభవములయందును స్వతస్సిద్ధములైన సుఖ

  • ఈ పద్యము శ్రీ అనంత కృష్ణశర్మ విరచితము. రఘువంశము (స. గా, 80)