పుట:Kavitvatatvavicharamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4, &9 యిత్యాదులు) (2) భావములు. అనగా మనోవికారములు. ఉదా : కామక్రోధాదులు, పేమ, ప్రశ్చాత్తాపము, దయ, దాక్షిణ్యము మొదలగు చిత్తసంచారములు. (3) సంకల్పములు. అనగా నేదైన నొకదానిం గోరి, దానిని సాధింపవలయునని ప్రతిజ్ఞఁబూనుట. ఈ మూడు శక్తులలో భావనాశక్తి నధికంబుగ విజృంభింపఁ జేయు నవి భావములు, కొయ్యలరీతినో, మహర్డుల చందంబుననో, నిర్వి కారస్థితి నుండు వారు పద్దెములు వ్రాయ నేర్తురుగాని, కవులగుట యసంభవము. ఏవృత్తాంతమునైనఁ జూచునట్లు వర్ణింపవలయు నన్న దానియొక్క స్థితిగతులను, నందలి పాత్రముల సుఖ దుఃఖములను, రోమరోమమునకును దానే మనఃపూర్వకముగ ననుభవించినందప్ప, తద్రూపముగ నభినయింప నెవరికిని దరము గాదు. చిత్త చాంచల్యము గూడదను వారు ఇట్టి యునుభవములకు మనిసిచ్చి సమ్మతింపరుగావున వారియందు శాస్త్రజ్ఞానమొక వేళ బ్రకాశమునకు వచ్చిన రావచ్చును గాని, శిల్పకళ లేమాత్రమును మొలకెత్తనేరవు. ఈ విషయము పామరులు సైతము గొంతకుఁగొంత యొ కిఁగినదే. కావున నే కాళిదాసు, తిక్కన్న మొదలగు మహాకవు లెల్లరు రసికులనియు స్త్రీలోలురనియు వారు గాథలు కట్టి యుండుట ! ఇంతే కాదు. భావములు కోరికలు రసములును మనసులో వెల్లివిరి సెనేని, జనులు మూగలట్లు పందల మాడ్కి మూలఁబడి, నిశ్చేష్టితులై యచల తత్త్వముం బూనియుండుట యరిది. అట్టివారు అనేకవిధములైన యుద్యమములకుంబూని కార్య నిపుణులగుదురు. కావున భావనాశక్తి, సంఘటనోత్సాహము ఇవి పరస్పర మిత్రములనుట విమర్శన శాస్త్రమునందలి యూది మ తత్వము. అట్లగుట నింకను వివరముగఁ దెల్పుట విధి. భావనాశక్తికి కార్యోత్సాహమునకు నుండు సామ్యము “ఘనములైన రాజకార్యములం దాసక్తికొని ప్రవేశించినవారు గద్యపద్యాది నిర్మాణశిల్పమునకుం దొడంగు వారైనచో వారు సులభముగను త్వరితముగను దత్కళా ప్రవీణులౌట నైసర్గికము కార్య గంభీరుల రచనయందు సారము, వీర్యము, ఉద్వేగము, చుఱుకుcదనము ఇత్యాది నానాపదంబులచేఁ బేర్కొనఁబడు నుగుణ మొకండు అఖండముగనుండును. కావున నట్టివారి కృతులు కేవలపండితుల గ్రంథములవలె రుచిలేనివిగను, చప్పిడి గను, మొద్దు పాఱినవిగను ఉండవు" అని విద్యాధురంధరులైన