పుట:Kavitvatatvavicharamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 కవిత్వతత్త్వ విచారము

"మార్లీ" ప్రభువుగారు సుమారు 25 సంవత్సరముల క్రిందనే వ్రాసిరి. దీనికి రాజకార్యవిచక్షణుఁడైన మన తిక్కన్నయే నిర్వి కల్పుండైన సాక్షి. కాళిదాసుఁడును గార్యోత్సాహపరులలో మిన్న యైనవాఁడని యతనింగూర్చిన కథల చే నూహింపవచ్చును. మఱియు దేశచరిత్రములఁ బట్టి చూచినచో యుద్ధాది వీరకృత్యంబు లకుం జనులు గడంగు కాలంబులలో మాత్రము కవిత్వమును విజృంభించుచుండెననుట నిర్వివాదముగ నెఱుఁగనగు ఇందులకు హేతువును విశదమ. అట్టికాలములో నెట్టి జడులును బయి పులును గొంతకుఁ గొంతయైన దేశభక్తియు శత్రుసంహనన సంరంభంబును దాల్పక మానరు. ఇఁక సామాన్యమైనవారన్ననో హృదయములు పగులునట్లు వీర్యాదిభావములం దాల్చుట ప్రకృతి విరోధంబు గాదు. భార్యను బిడ్డలను విడిచి యుద్ధమునకుఁ బో వువాని యాత్మలో నెన్ని భావములు తాండవ మాడుచుండవు ! కుటుంబ మును విడిచి పోవలయుఁ గదా యను దుఃఖము, మరల నా వారిని గన్నులారఁ జూతునో చూడనో యను దిగులు, ఇఁక యుద్ధమునకుఁ బోకున్నఁ బరులు వచ్చి తనవారి ప్రాణములకు మాత్రమా, మానము నకును భంగపాటు దెత్తురో యను రోషము, తన వారికిని తన రాష్ట్రమునకు నై వినియోగింపక యీ నా ప్రాణమును మూటగటు కొనిపోయి యేగంగలో బడ వేయు వాఁడనను దార్ధ్యము ! ఇత్యాదిగ లెక్కకు మీరిన మనోవికారములను దలచుకొన్ననే మనకు నే మో యగునట్టు లుండునుగదా ! ఇఁక వారికిని వారి కాలము వారికిని గలుగు ను ద్రేకమును వర్ణింపనవునా ? ఉద్రేక మేకదా కవితాశక్తికి ప్రాణాధారమైన కారణము ? ఈ దృష్టాంతములో “మనోవికార ములు" అను పదమును విధిలేక వాడితిని . ఈ వికారములన్న పదము నాది గాదు. మఱి

తిండిపోత నీకు భండనం బేటికిఁ
గడవఁ జేరి మనసు గాంక్షదీర
నోపు కొలఁది మింగియూరక నీవింటి
కడనయుండు ”

మని మగవారిచే గర్తింపఁబడు పేడి వారి తెగకుఁ జేరిన మన వెదాం. తులు మొదలైన వారిచే సృష్టింపబడిన పదము ! గొప్ప గొప్ప భావములు వికారములఁట ! దుర్గంధ ప్రళయముగా మూలఁ గూలంబడి ముక్కును బట్టి కూర్చున్ననేమి సుందరాకారమో !